[1] ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను. యెహోవా, నేను నీకు భజన చేస్తాను.
[2] నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను. నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను. యెహోవా నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
[3] నాయెదుట ఏ విగ్రహాలు ఉంచుకోను. అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను. నేను అలా చేయను!
[4] నేను నిజాయితీగా ఉంటాను. నేను దుర్మార్గపు పనులు చేయను.
[5] ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను. మనుష్యులు ఇతరులకంటే తామే మంచి వారమని తలుస్తూ అతిశయించడం నేను జరుగ నివ్వను.
[6] నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను. ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను. యదార్థ జీవితాలు జీవించే వాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
[7] అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను. అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.
[8] ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను. దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.