Skip to content
Opens in a new window

[1] సీయోను మీద ఉన్న దేవా, నేను నిన్ను స్తుతిస్తాను. నేను వాగ్దానం చేసిన వాటిని నేను నీకు ఇస్తాను.

[2] నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబతాము మరియు నీవు మా ప్రార్థనలు వింటావు. నీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషి యొక్క ప్రార్థనలూ నీవు వింటావు.

[3] మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు, ఆ పాపాలను నీవు తీసివేస్తావు.

[4] దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు. నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు. మాకు చాలా సంతోషంగా ఉంది! నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి.

[5] దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు. నీవు వారి ప్రార్థనలకు జవాబిస్తావు. వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ముకొంటారు.

[6] దేవుడు తన మహా శక్తిని ఉపయోగించి పర్వతాలను చేశాడు. మనచుట్టూరా ఆయన శక్తిని చూడగలము.

[7] ఘోషించే సముద్రాలను దేవుడు నిమ్మళింప చేస్తాడు. మరియు ప్రపంచంలో “అనేకంగా” ఉన్న మనుష్యులందరినీ దేవుడు చేస్తాడు.

[8] దేవుడు చేసే శక్తివంతమైన విషయాలకు భూమిమీద ప్రతి మనిషీ భయపడతాడు. దేవా, నీవు సూర్యుని ఉదయింపజేసి, ఆస్తమింపజేసే ప్రతి చోటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.

[9] నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు. నీవు దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా నీవు చేస్తావు. దేవా, నీవు కాలువలను నీళ్లతో నింపుతావు. పంటలు పండింపచేస్తావు. నీవు దీనిని ఇలా చేస్తావు.

[10] దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు. భూములను నీవు నీళ్లతో నానబెడతావు. నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు. అప్పుడు నీవు మొలకలను ఎదిగింపచేస్తావు.

[11] కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు. బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.

[12] ఆరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి.

[13] పచ్చిక బయళ్లు గొర్రెలతో నిండిపోయాయి. లోయలు ధాన్యంతో నిండిపోయాయి. పచ్చిక బయళ్లు, లోయలు సంతోషంతో పాడుతున్నట్లున్నాయి.

కీర్తనల గ్రంథము — Chapters