[1] యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము. యాకోబు ప్రజలు విదేశంలో ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలను తిరిగి వారి దేశానికి తీసుకొని రమ్ము.
[2] యెహోవా, నీ ప్రజలను క్షమించుము! వారి పాపాలు తుడిచివేయుము.
[3] యెహోవా, కోపంగాను, ఆవేశంగా నుండవద్దు.
[4] మా దేవా, రక్షకా, మా మీద కోపగించటం మానివేసి, మమ్మల్ని మరల స్వీకరించు.
[5] నీవు మామీద శాశ్వతంగా కోపగిస్తావా?
[6] దయచేసి మమ్మల్ని మరల బ్రతికించుము! నీ ప్రజలను, సంతోషింపజేయుము.
[7] యెహోవా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా మాకు చూపించుము. మమ్మల్ని రక్షించుము.
[8] దేవుడు చప్పేది నేను వింటున్నాను. తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబతున్నాడు. ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
[9] దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు. మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బతుకుతాము.
[10] దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది. మంచితనం, శాంతి, ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
[11] భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా వుంటారు. పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
[12] యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు. భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
[13] మంచితనం దేవునికి ముందర నడుస్తూ ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.