Skip to content
Opens in a new window

[1] దేవా, నా హృదయం నా ఆత్మ నిశ్చలముగానున్నది. నేను పాడుటకు, స్తుతి కీర్తనలు వాయించుటకు సిద్ధంగా ఉన్నాను.

[2] స్వర మండలములారా, సితారలారా మనం సూర్యున్ని మేల్కొలుపుదాం

[3] యెహోవా, ఆయా జనములలో మేము నిన్ను స్తుతిస్తాము. ఇతర ప్రజల మధ్య మేము నిన్ను స్తుతిస్తాము.

[4] యెహోవా, నీ ప్రేమ ఆకాశాల కన్న ఉన్నతమైనది. నీ నిజమైన ప్రేమ మహా ఎత్తయిన మేఘాల కన్న ఉన్నతమైనది. నీ సత్యం ఆకాశాలవరకు కూడా చేరుకున్నది.

[5] దేవా, ఆకాశాలకు పైగా లెమ్ము! సర్వ ప్రపంచం నీ మహిమను చూడనిమ్ము.

[6] దేవా, నీకిష్టులైనవారిని రక్షించుము. నా ప్రార్థనకు జవాబు ఇచ్చి నాకు సహాయం చేయుము.

[7] యెహోవా తన ఆలయము నుండి మాట్లాడి యిలా చెప్పాడు, “యుద్ధంలో నేను గెలుస్తాను! ఆ గెలుపును బట్టి సంతోషంగా ఉంటాను. (ఈ భూమిని నా ప్రజలకు విభాగించి ఇస్తాను) నా ప్రజలకు షెకెమును ఇస్తాను. వారికి సుక్కోతులోయను ఇస్తాను.

[8] గిలాదు, మనష్షే నావి. ఎఫ్రాయిము నా శిరస్త్రాణం. యూదా నా రాజ దండం.

[9] మోయాబు నా పాదాలు కడుగుకొనే పళ్లెం. ఎదోము నా చెప్పులు మోసే బానిస. ఫిలిష్తీయులను జయించాక నేను విజయంతో కేకలు వేస్తాను.”

[10] శత్రు దుర్గములోనికి నన్ను ఎవరు నడిపిస్తారు? ఎదోమును జయించటానికి నాకు ఎవరు సహాయం చేస్తారు?

[11] దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావని మా సైన్యంతో నీవు వెళ్లవు అని అనటం నిజమేనా?

[12] దేవా, మా శత్రువును ఓడించుటకు దయచేసి మాకు సహాయం చేయుము మనుష్యులు మాకు సహాయం చేయలేరు!

[13] దేవుడు మాత్రమే మమ్మల్ని బలపరచగలడు. దేవుడు మాత్రమే మా శత్రువులను ఓడించగలడు.

కీర్తనల గ్రంథము — Chapters