[1] యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు. వారు ఎన్నటికీ కదలరు. వారు శాశ్వతంగా కొనసాగుతారు.
[2] యెరూషలేము చుట్టూరా పర్వతాలు ఉన్నాయి. అదే విధంగా యెహోవా తన ప్రజల చుట్టూరా ఉన్నాడు. యెహోవా తన ప్రజలను నిరంతరం కాపాడుతాడు.
[3] దుర్మార్గులు మంచి ప్రజల దేశాన్ని శాశ్వతంగా వశం చేసుకోరు. దుర్మార్గులు అలా చేస్తే అప్పుడు మంచి మనుష్యులు కూడా చెడ్డ పనులు చేయటం మొదలు పెడతారేమో.
[4] యెహోవా, మంచి మనుష్యులకు మంచి వాడవుగా ఉండుము. పవిత్ర హృదయాలు గల మనుష్యులకు మంచి వాడవుగా ఉండుము.
[5] యెహోవా, దుర్మార్గులను నీవు శిక్షించుము. వాళ్లు వక్రమైన పనులు చేస్తారు. ఇశ్రాయేలులో శాంతి ఉండనిమ్ము.
కీర్తనల గ్రంథము — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150