[1] గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో? ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.
[2] గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో? ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో?
[3] అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా వాళ్లు మనల్ని సజీవంగా మింగేసిఉండేవాళ్లు.
[4] అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా, మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి.
[5] అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.
[6] యెహోవాను స్తుతించండి. మన శత్రువులు మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.
[7] మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము. వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము.
[8] మనకు సహాయం యోహోవా దగ్గర నుండే వచ్చింది. భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
కీర్తనల గ్రంథము — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150