Skip to content
Opens in a new window

[1] సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడతాను. యెహోవాను నేను ప్రార్థిస్తాను.

[2] నా సమస్యలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను. నా కష్టాలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.

[3] నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు. నా ప్రాణం నాలో మునిగిపోయింది. అయితే నాకు ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు.

[4] నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ కనిపించలేదు. పారిపోవుటకు నాకు స్థలం లేదు. నన్ను రక్షించటానికి ఏ మనిషీ ప్రయత్నం చేయటం లేదు.

[5] కనుక సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడుతున్నాను. యెహోవా, నీవే నా క్షేమ స్థానం. యెహోవా, నీవు నన్ను జీవింపనియ్యగలవు.

[6] యెహోవా, నా ప్రార్థన విను. నీవు నాకు ఎంతో అవసరం. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము. నాకంటే ఆ మనుష్యులు చాలా బలంగల వాళ్లు.

[7] ఈ ఉచ్చు తప్పించుకొనేందుకు నాకు సహాయం చేయుము. యెహోవా, అప్పుడు నేను నీ నామాన్ని స్తుతిస్తాను. నీవు నన్ను రక్షిస్తే మంచి మనుష్యులు సమావేశమై, నిన్ను స్తుతిస్తారని నేను ప్రమాణం చేస్తాను.

కీర్తనల గ్రంథము — Chapters