Skip to content
Opens in a new window

[1] దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము. నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము.

[2] దేవా నా ప్రార్థనను, నేను చెప్పే సంగతులను ఆలకించుము.

[3] పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు. బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు.

[4] చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా ప్రభువు నన్ను బలపరుస్తాడు.

[5] తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు. దేవా, నీవు నాకు నమ్మకస్తుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము.

[6] దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను. యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు.

[7] నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు. మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను.

కీర్తనల గ్రంథము — Chapters