Skip to content
Opens in a new window

[1] యెహోవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను. నేను నిన్ను ప్రార్థిస్తూండగా, నీవు నా మనవి వినుము. త్వరపడి నాకు సహాయం చేయుము.

[2] యెహోవా, నా ప్రార్థన అంగీకరించి, అది ఒక కానుకలా ఉండనిమ్ము. నా ప్రార్థన నీకు సాయంకాల బలిగా ఉండనిమ్ము.

[3] యెహోవా, నేను చెప్పే విషయాలను అదుపులో ఉంచుకొనేందుకు నాకు సహాయం చేయుము. నేను చెప్పే విషయాలను గమనించుటకు నాకు సహాయం చేయుము.

[4] నా హృదయం ఏ చెడు సంగతులవైపూ మొగ్గేలా అనుమతించవద్దు. చెడ్డ మనుష్యులతో చేరకుండా, తప్పు చేయకుండా ఉండుటకు నాకు సహాయం చేయుము. చెడ్డవాళ్లు చేస్తూ ఆనందించే విషయాల్లో నన్ను బాగస్థుడను కాకుండా చేయుము.

[5] ఒక మంచి మనిషి నన్ను సరిదిద్ది విమర్శించవచ్చు. అది నాకు మంచిదే. వారి విమర్శను నేను అంగీకరిస్తాను. నా ప్రార్థన ఎల్లప్పుడూ చెడు చేసేవారి పనులకు విరోధంగా వుంటుంది.

[6] ఎత్తయిన కొండ శిఖరం నుండి వారి పాలకులు కిందికి పడదోయబడతారు. అప్పుడు నేను చెప్పింది సత్యం అని ప్రజలు తెలుసుకుంటారు.

[7] మనుష్యులు నేలను తవ్వి దున్నుతారు. మట్టి వెదజల్లబడుతుంది. అదే విధంగా ఆ దుర్మార్గుల యెముకలు వారి సమాధిలో వెదజల్లబడుతాయి.

[8] యెహోవా నా ప్రభువా, సహాయం కోసం నేను నీ తట్టు చూస్తున్నాను. నేను నిన్ను నమ్ముకొన్నాను. దయచేసి నన్ను చావనివ్వకుము.

[9] ఆ దుర్మార్గుల ఉచ్చులోకి నన్ను పడనియ్యకుము. ఆ దుర్మార్గులచే నన్ను ఉచ్చులో పట్టుబడనివ్వకుము.

[10] నేను హాని లేకుండా తప్పించుకొనగా ఆ దుర్మార్గులు తమ ఉచ్చులలోనే పట్టుబడనిమ్ము.

కీర్తనల గ్రంథము — Chapters