Skip to content
Opens in a new window

[1] యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.

[2] “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.

[3] “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని యాజకులారా, మీరు చెప్పండి.

[4] “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి.

[5] నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను, యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు.

[6] యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయ పడను. నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు.

[7] యెహోవా నా సహాయకుడు; నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను.

[8] మనుష్యులను నమ్ముకొనుటకంటే యెహోవాను నమ్ముట మేలు.

[9] మీ నాయకులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు.

[10] అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు. యెహోవా శక్తిలో నేను నా శత్రువులను ఓడించాను.

[11] శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు. యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.

[12] తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు. కాని వేగంగా కాలిపోతున్న పాదలా వారు అంతం చేయబడ్డారు. యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.

[13] నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు. కాని యెహోవా నాకు సహాయం చేశాడు.

[14] యెహోవా నా బలం, నా విజయ గీతం! యెహోవా నన్ను రక్షిస్తాడు!

[15] మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు. యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.

[16] యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి. యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.

[17] నేను జీవిస్తాను! కాని మరణించను. మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబతాను.

[18] యెహోవా నన్ను శక్షించాడు, కాని ఆయన నన్ను చావనియ్య లేదు.

[19] మంచి గుమ్మములారా నా కోసం తెరచుకోండి, నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.

[20] అవి యెహోవా గుమ్మాలు. ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.

[21] యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

[22] ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూల రాయి అయ్యింది.

[23] ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు. అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.

[24] ఈ వేళ యెహోవా చేసిన రోజు. ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!

[25] ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి. దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము.

[26] యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.” యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము!

[27] యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు. బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల వద్దకు గొర్రెపిల్లను మోసి కొని రండి.”

[28] యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేను నిన్ను స్తుతిస్తున్నాను.

[29] యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

కీర్తనల గ్రంథము — Chapters