Skip to content
Opens in a new window

[1] దేవుడు మా ఆశ్రయం, మా శక్తి. ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.

[2] అందుచేత భూమి కంపించినప్పుడు, మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.

[3] సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను, భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.

[4] ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి, మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.

[5] ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు. సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.

[6] రాజ్యాలు భయంతో పణకుతాయి. యెహోవా కేక వేయగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.

[7] సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.

[8] చూడండి, యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి. ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.

[9] భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు. సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.

[10] దేవుడు చెబతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకోనండి. రాజ్యాలతో నేను స్తుతించబడతాను. భూమిమీద మహిమపర్చబడతాను.”

[11] సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.

కీర్తనల గ్రంథము — Chapters