[1] నేను కష్టంలో ఉన్నాను. సహాయం కోసం నేను యెహోవాకు మొరపెట్టాను. ఆయన నన్ను రక్షించాడు.
[2] యెహోవా, మోసకరమైన నాలుకనుండి, నాకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పిన వారినుండి నన్ను రక్షించుము.
[3] అబద్దికులారా, యెహోవా మిమ్మల్ని ఎలా శిక్షిస్తాడో మీకు తెలుసా? మీరేమి పొందుతారో మీకు తెలుసా?
[4] మిమ్మల్ని శిక్షించటానికి దేవుడు సైనికుని వాడిగల బాణాన్ని, మండుతున్న నిప్పులను ఉపయోగిస్తాడు.
[5] అబద్ధికులారా, మీ దగ్గర్లో నివసించటం మెషెకులో నివసించటంలాగే ఉంటుంది. అది కేదారు గుడారాల్లో నివసించినట్టే ఉంటుంది.
[6] శాంతిని ద్వేషించే ప్రజలతో నేను చాలా ఎక్కువ కాలం జీవించాను.
[7] నాకు శాంతి కావాలి. అది నేను చెప్పినట్లు ఆ ప్రజలకు యుద్ధం కావాలి.
కీర్తనల గ్రంథము — Chapters
123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150