[1] యెహోవాను స్తుతించండి. యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి! ఆయన అనుచరులును కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి.
[2] ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలసి అనందించనివ్వండి. సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి.
[3] ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ నాట్యమాడుతూ దేవుని స్తుతించ నివ్వండి.
[4] యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు. దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు. ఆయన వారిని రక్షించాడు!
[5] దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి. పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి.
[6] ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక. ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని
[7] వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక. వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక.
[8] ఆ రాజులకు, ప్రముఖులకు దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు.
[9] దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు. దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు. యెహోవాను స్తుతించండి!