Skip to content
Opens in a new window

[1] దేవా, నన్ను రక్షించుము. దేవా త్వరపడి నాకు సహాయం చేయుము.

[2] మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. వారిని నిరాశపరచుము. వారిని అవమానించుము. మనుష్యులు నాకు చెడు కార్యాలు చేయాలని కోరుతున్నారు. వారు పడిపోయి సిగ్గు అనుభవిస్తారని నా నిరీక్షణ.

[3] మనుష్యులు నన్ను హేళన చేసారు. వారికి తగినదాన్ని పొందుతారని నా నిరీక్షణ.

[4] నిన్ను ఆరాధించే ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. నీ మూలంగా రక్షించబడుటకు ఇష్టపడే మనుష్యులు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించగలుగుతారు.

[5] నేను నిరుపేదని, నిస్సహాయుణ్ణి. దేవా, త్వరపడి! వచ్చి నన్ను రక్షించుము. దేవా, నన్ను తప్పించగల వాడవు నీవు ఒక్కడవు మాత్రమే. ఆలస్యం చేయవద్దు!

కీర్తనల గ్రంథము — Chapters