Skip to content
Opens in a new window

[1] “పిలిచి చూడు – ఎవరు మారు పలుకుతారు నీకు? పవిత్ర దేవదూతలలో ఎవరివైపు నీవు తిరుగుతావు?

[2] కోపం చేత మూర్ఖులు చస్తారు. అసూయవల్ల తెలివితక్కువ వాళ్ళు నాశనమవుతారు.

[3] మూర్ఖుడు వేరుపారివుండడం నేను చూశాను. అయినా వెంటనే ‘అతడి నివాసం శపితమే’ అన్నాను.

[4] అతడి పిల్లలకు క్షేమం దూరం అయింది. గుమ్మం దగ్గరే వాళ్ళు చితికిపోయారు. వాళ్ళను రక్షించే వారెవరూ లేరు.

[5] ఆకలి ఉన్నవాళ్ళు అతడి పంట కాస్తా తినేస్తారు. ముండ్లలోనుంచి కూడా దాన్ని కాజేస్తారు. నాశనం వాడి ఆస్తికోసం పొంచివుంది.

[6] దుమ్ములోనుంచి శ్రమ పుట్టుక రాదు. బాధ భూమిలోనుంచి మొలవదు.

[7] నిప్పురవ్వలు పైకెగిరినట్లు మనిషి పుట్టుక బాధలకోసమే.

[8] నామట్టుకు నేనైతే దేవునికే చెప్పుకొనేవాణ్ణి. దేవునికే నా వ్యవహారం అప్పగించేవాణ్ణి.

[9] దేవుడు చేసే మహా క్రియలు పరిశోధించలేము. ఆయన జరిగించే అద్భుతాలు అసంఖ్యాకాలు.

[10] ఆయన భూమిమీద వాన కురిపిస్తాడు. తద్వారా పొలాలకు నీటి పారుదల కలిగిస్తాడు.

[11] ఆయన దీనావస్థలో ఉన్నవారికి పైస్థానం ప్రసాదిస్తాడు. శోకించేవాళ్ళను సంక్షేమ స్థితికి పైకి ఎత్తుతాడు.

[12] దేవుడు యుక్తిపరుల పన్నాగాలను భంగపరుస్తారు. వాళ్ళ ఆలోచన నెరవేర్చలేకపోతారు.

[13] దేవుడు జ్ఞానుల యుక్తిమూలంగానే వాళ్ళను పట్టుకుంటాడు. వంచకుల ఉపాయాలను ఆయన తారుమారు చేస్తాడు.

[14] పగలు వాళ్ళకు చీకటి ఎదురవుతుంది. మధ్యాహ్నం పూట రాత్రిలోలాగా తడుముకుంటారు.

[15] వాళ్ళ నోరు ఖడ్గంలాంటిది. దాని బారినుంచి దరిద్రులను ఆయన తప్పిస్తాడు. బలాఢ్యుల చేతిలో నుంచి విడిపిస్తాడు.

[16] కాబట్టి పేదలకు ఆశాభావం కలుగుతుంది. అన్యాయానికి నోరు పడిపోతుంది.

[17] ఇదిగో విను, దేవుడు శిక్షించి సరిదిద్దే మనిషి ధన్యజీవి. కనుక అమితశక్తి గలవాని క్రమశిక్షణను నిర్లక్ష్యం చెయ్యకు.

[18] ఆయన గాయం చేస్తే, దానిని బాగు చేస్తాడు కూడా. ఆయన దెబ్బ తీస్తాడు అయితే తన చేతులతోనే ఆ గాయం మాన్పుతాడు.

[19] ఆరు కష్టాలు వస్తే ఆయన నిన్ను తప్పిస్తాడు. ఏడు కష్టాలు వచ్చినా నీకు హాని కలగదు.

[20] కరవు కాటకాలలో నిన్ను చావునుంచి తప్పిస్తాడు. యుద్ధంలో కత్తివాత నుంచి కాపాడుతాడు.

[21] నోటి దురుసుతనం నుంచి ఆయన నిన్ను దాచేస్తాడు. దౌర్జన్యం వచ్చినా నీకేమీ భయం ఉండదు.

[22] పొలంలోని రాళ్ళు కూడా నీతో సఖ్యంగా ఉంటాయి. అడవి మృగాలు నీతో మచ్చికగా ఉంటాయి.

[23] కరవు, దౌర్జన్యం ప్రాప్తిస్తే, చిరునవ్వుతో ఉంటావు. అడవి మృగాలకు నువ్వేమీ భయపడవు!

[24] నీ డేరాలో శాంతి భద్రతలు ఉన్నాయని తెలుసుకుంటావు. నీ ఇంట్లో సామాన్లు కలయచూస్తే ఏదీ పోయివుండదు.

[25] అంతే కాదు. నీ సంతతి సంఖ్య పెరుగుతుంది. నీ సంతానం లెక్కలో భూమిమీద గడ్డిలాగా విస్తరిస్తారు. దీని గురించి నీకు నిశ్చయత ఉంటుంది.

[26] పంటకాలంలో ధాన్యం ఇంటికి చేరినట్లు వయస్సు పండిన తరువాత నీవు సమాధికి చేరుతావు.

[27] “మేము ఈ విషయాలు తరచి చూచినవి. ఇవి వాస్తవం. నీవు ఇవి విని స్వయంగా తెలుసుకో!”

యోబు — Chapters