[1] అప్పుడు షూహియావాడు బిల్దదు ఈ విధంగా జవాబిచ్చాడు:
[2] “ఆధిపత్యం, బీకరత్వం ఆయనకు చెందుతాయి. తన పరమ ప్రదేశాలలో ఆయన శాంతి సుస్థిరం చేస్తాడు.
[3] ఆయన సేనలెన్నో లెక్క పెట్టడం ఎవరికి చేతనవుతుంది? ఆయన వెలుగు ఎవరిమీద అయినా ఉదయించకుండా ఉంటుందా?
[4] మరి, దేవుని ఎదుట మనిషి నిర్దోషి ఎలా కాగలడు? స్త్రీ గర్భాన పుట్టినవాడు శుద్ధుడు ఎలా అవుతాడు?
[5] ఆయన దృష్టిలో చంద్రగోళానికి కాంతి లేదు. నక్షత్రాలు శుద్ధమైనవి కావు.
[6] అలాంటప్పుడు పురుగులాంటి మానవుడు, కీటకంవంటి మనిషి ఆయన దృష్టిలో అసలే శుద్ధుడు కాలేడు!