Skip to content
Opens in a new window

[1] నోవహు కుమారులు షేము, హాము, యాపెతుల సంతతివారి వంశవృక్షం ఇది: జలప్రళయం తరువాత వారికి కొడుకులు పుట్టారు.

[2] యాపెతు కొడుకుల పేర్లు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.

[3] గోమెరు కొడుకుల పేర్లు అష్కనజు, రీఫతు, తోగర్మా.

[4] యావాను కొడుకులు ఎలీషా, తర్షీషు, కిత్తీం, దాదోనీం.

[5] వీరి సంతతివారు సముద్రతీర ప్రాంతాలకు, లంకలకు వెళ్తూ తమ తమ భాషల ప్రకారమూ వంశాల ప్రకారమూ వేరు వేరు ప్రజలయ్యారు.

[6] హాము కొడుకుల పేర్లు కూషు, మిస్రాయిం, పూతు, కనాను.

[7] కూషు కొడుకులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తాకా. రాయమా కొడుకులు శెబా, దదాను.

[8] కూషుకు నిమ్రోదు కూడా పుట్టాడు. అతడు భూమిమీద పరాక్రమశాలి కాసాగాడు.

[9] అతడు యెహోవా ఎదుట వేటలో పరాక్రమశాలి. అందుచేత “యెహోవా ఎదుట వేటలో పరాక్రమశాలి నిమ్రోదులాగా” అనే లోకోక్తి ఉంది.

[10] అతడి రాజ్యం షీనారు దేశంలో ఉన్న బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలతో ఆరంభమైంది.

[11] ఆ దేశంనుంచి అష్షూరుకు వెళ్ళి నీనెవె, రహోబోతునగర్, కాలహూనూ,

[12] నీనెవెకూ కాలహుకు మధ్య ఉన్న రెసెనునూ కట్టాడు. ఇవన్నీ కలిసి ఆ ఒకే గొప్ప పట్టణంగా ఉన్నాయి.

[13] మిస్రాయిం ఈ వేరు వేరు ప్రజలకు ఆదిపురుషుడు – లూదీయ జాతివారు, అనాం, లెహాబు, నప్తుహు, పత్రసు, కస్లూహు, కఫ్తోరు జాతులవారు.

[14] కస్లూహు వారిలో నుంచి ఫిలిష్తీయవారు వచ్చారు.

[15] కనాను అనే వ్యక్తికి మొదట పుట్టినవాడు సీదోను.

[16] కనాను హేతుజాతివారికి, యెబూసి, అమోరీ, గిర్గాషి,

[17] హివ్వి, అర్కి, సిని,

[18] అర్వాది, సెమారి, హమాతి జాతులవారికి కూడా ఆదిపురుషుడు. తరువాత కనానుకు చెందిన వంశాలు ఆయా ప్రాంతాలకు చెదరిపొయ్యాయి.

[19] కనానుజాతివారి సరిహద్దులు సీదోను పట్టణం నుంచి గెరారు గ్రామం దిక్కున గాజావరకూ, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిం పట్టణాల వైపుగా లాషావరకూ ఉండేవి.

[20] వీరంతా హాము సంతతివారు. వారి వంశాలూ భాషలూ దేశాలూ, జాతులూ ఇవే.

[21] షేముకు కూడా సంతానం కలిగింది. షేము యాపెతుకు అన్న, ఏబెరు కొడుకులందరికీ ఆదిపురుషుడు.

[22] షేము కొడుకులు ఎవరంటే, ఏలాం, అష్షూరు, అర్పక్షదు, లూదు, ఆరాం.

[23] ఆరాం కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాషు.

[24] అర్పక్షదుకు షేలహు జన్మించాడు. షేలహుకు ఏబెరు జన్మించాడు.

[25] ఏబెరుకు ఇద్దరు కొడుకులు జన్మించారు. ఒకడి పేరు పెలెగు. ఎందుకంటే అతడి రోజుల్లో భూలోకం దేశాలుగా విభాగమైంది. అతని తోబుట్టువు యొక్తాను.

[26] యొక్తానుకు జన్మించిన వారు ఎవరంటే, అల్మోదాదు, శెలపు, హసరు, మావెతు, యెరహు,

[27] హాదోరం, ఊజాలు, దిక్లాను,

[28] ఓబాలు, అబీమాయేలు, షేబ,

[29] ఓఫీరు, హవీలా, యొబాబు. వీరంతా యొక్తాను కొడుకులు.

[30] వారు నివసించే ప్రాంతం మేషా నుంచి సపారా దిక్కుగా తూర్పు పర్వతం వరకూ ఉండేది.

[31] వీరు షేము కొడుకులు. వారి వంశాలు, భాషలు, దేశాలు, జాతులు ఇవే.

[32] ఇవి నోవహు కొడుకుల వంశాలు. వారి తరాలు, ప్రజలు, జలప్రళయం తరువాత వీరిలోనుంచి వచ్చినవారే లోకంలో వేరు వేరు ప్రజలుగా విడిపోయారు.

ఆదికాండం (ఆరంభాలు) — Chapters