Skip to content
Opens in a new window
Listen to this chapter • 0:44

[1] అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు.

[2] అధికారం, భీకరత్వం ఆయనవి. ఆయన పరలోక స్థలాల్లో క్రమం నెలకొల్పుతాడు.

[3] ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయించకుండా ఉంటుందా?

[4] మనిషి దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా శుద్ధుడు కాగలడు?

[5] ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. నక్షత్రాలు పవిత్రమైనవి కావు.

[6] మరి నిశ్చయంగా పురుగు-పురుగులాంటి నరుడు అంతే కదా.

యోబు — Chapters