Skip to content
Opens in a new window

[1] మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:

[2] “మానవపుత్రా, ద్రాక్షచెట్టు కర్ర అడవిచెట్లలో తక్కినవాటి కర్రలకంటే ఏమైనా మంచిదా?

[3] దేనినైనా చేయడానికి ద్రాక్షచెట్టు కర్రను ఎవరైనా తీసుకొంటారా? దానితో మేకును చేసి ఆ మేకుకు వస్తువులు తగిలిస్తారా?

[4] దాన్ని వంటచెరుకుగా నిప్పులో వేస్తే, దాని రెండు కొనలు నిప్పుచేత బాగా కాలిపోయి, దాని మధ్యభాగం నల్లబడితే అది దేనికైనా పనికి వస్తుందా?

[5] కాలకముందే పనికిరాకపోతే నిప్పుచేత కాలిపోయి నల్లబడ్డ తరువాత అది దేనికైనా పనికి వస్తుందా?

[6] “అందుచేత యెహోవాప్రభువు ఇలా చెపుతున్నాడు: అడవి చెట్లలో ద్రాక్షచెట్టు కర్రను నేను నిప్పుకు నియమించినట్టే జెరుసలం నగరవాసుల పట్ల వ్యవహరిస్తాను.

[7] వాళ్ళను ఏమీ కటాక్షించను. వాళ్ళు మునుపు మంటలనుంచి తప్పించుకొన్నా, మంటలు వాళ్ళను దహించివేస్తాయి. వాళ్ళను కటాక్షించక పోయినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు.

[8] వాళ్ళు ద్రోహం చేశారు గనుక నేను దేశాన్ని పాడు చేస్తాను. ఇది యెహోవాప్రభు వాక్కు.”

యెహెజ్కేలు — Chapters