Skip to content
Opens in a new window

[1] “యోబూ, నీవు మొసలిని గాలముతో పట్టుకొనగలవా? దాని నాలుకను తాడుతో కట్టివేయగలవా?

[2] యోబూ, మొసలి ముక్కులోనుంచి తాడును నీవు వేయగలవా? లేక దాని దవడకు గాలపు ముల్లు ఎక్కించగలవా?

[3] యోబూ, తన్ను స్వేచ్చగా పోనిమ్మని మొసలి నిన్ను బతిమాలాడుతుందా? అది మర్యాద మాటలతో నీతో మాట్లాడుతుందా?

[4] యోబూ, మొసలి నీతో ఒడంబడిక చేసు కుంటుందా? శాశ్వతంగా నిన్ను సేవిస్తానని వాగ్దానం చేస్తుందా?

[5] యోబూ, నీవు ఒక పిట్టతో ఆడుకొన గలవా మొసలితో ఆడుకొ గలవా? నీ దాసీలు దానితో ఆడుకొనేందుకు దానికి ఒక తాడు కట్టగలవా?

[6] యోబూ, జాలరులు నీవద్ద మొసలిని కొనుటకు ప్రయత్నిస్తారా? వారు దానిని వ్యాపారులకు అమ్మేందుకు దానిని ముక్కలుగా కోయగలరా?

[7] యోబూ, మొసలి చర్మం మీదికి ఎన్నో శూలాలు నీవు విసరగలవా? లేక చేపలను వేటాడే అలుగులు అనేకం దాని తలమీద కొట్టగలవా?

[8] “యోబూ, ఒక వేళ నీవు నీ చేతిని మొసలి మీద ఉంచితే దానితో నీ గట్టి పోరాటాన్ని నీవు ఎప్పటికీ మరచిపోలేవు. మరియు నీవు దానితో మరల ఎన్నటికీ పోరాడవు.

[9] ఒక వేళ నీవు మొసలిని ఓడించగలనని అనుకుంటే అది మరచిపో! అలాంటి ఆశ ఏమీ లేదు! దాన్ని చూస్తేనే నీకు భయం పుడుతుంది.

[10] మొసలికి కోపం పుట్టించగలిగినంత ధైర్యంగల మనిషి ఎవరూ లేరు. “కనుక అలాంటప్పుడు యోబూ, నాకువిరోధంగా నిలువగలవాడు ఎవడు?

[11] నేను (దేవుణ్ణి) ఎవరికీ ఏమీ బాకీ లేను. ఆకాశమంతటి క్రింద ఉన్న సర్వము నాదే.

[12] “యోబూ, మొసలి కాళ్లను గూర్చి, దాని బలం, దాని అందమైన ఆకారం గూర్చి నేను నీతో చెబుతాను.

[13] మొసలి చర్మాన్ని ఎవరూ ఊడదీయలేరు. ఒక కళ్లెం పట్టుకొని ఎవ్వరూ దాని సమీపంగా రాజాలరు.

[14] మొసలి దవడలు తెరిపించడానికి ఎవరూ దానిని బలవంతం చేయలేరు. దాని దవడల్లోని పళ్లు మనుష్యులను భయపెడతాయి.

[15] మొసలి వీపు మీది గట్టి పొలుసుల వరుసలు దగ్గర దగ్గరగా కుదించబడ్డాయి.

[16] గాలి జొరబడలేనంత దగ్గర దగ్గరగా ఆ పొలుసులు ఉంటాయి.

[17] ఆ పొలుసులు ఒక దానితో ఒకటి జత చేయబడ్డాయి. వాటిని ఊడబెరుకుటకు వీలులేనంత గట్టిగా ఒకదానినొకటి అంటిపెట్టుకొని ఉంటాయి.

[18] మొసలి తుమ్మినప్పుడు అది వెలుగు ప్రకాశించినట్టుగా ఉంటుంది. దాని కళ్లు ఉదయపు వెలుగులా ఉంటాయి.

[19] దాని నోటి నుండి మండుతున్న జ్వాలలు బయటకు వస్తాయి. నిప్పు కణాలు బయటకు లేస్తాయి.

[20] ఉడుకుతూ ఉన్న కుండ కింద కాలుతున్న పిచ్చి మొక్కలనుండి పొగవచ్చినట్టుగా మొసలి ముక్కునుండి పొగ వస్తుంది.

[21] మొసలి శ్వాస బొగ్గులను మండిస్తుంది. దాని నోటినుండి అగ్ని జ్వాలలు వస్తాయి.

[22] “మొసలి మెడ చాలా బలంగా ఉంటుంది. మనుష్యులు దానిని చూచి భయపడి దాని నుండి పారిపోతారు.

[23] మొసలి శరీరంలో బలహీనత ఏమీ లేదు. అది ఇనుములా గట్టిగా ఉంటుంది.

[24] మొసలి గుండె బండలా ఉంటుంది. దానికి భయం ఏమీ లేదు. అది తిరుగలి కింది రాయిలా గట్టిగా ఉంటుంది.

[25] మొసలి మేల్కొన్నప్పుడు బలమైన మనుష్యులు భయపడతారు. మొసలి తోక ఆడించినప్పుడు వారు పారిపోతారు.

[26] ఖడ్గం, బల్లెం, బాణం మొసలిని కొడితే అవి తిరిగి వస్తాయి. ఆ ఆయుధాలు దానికే మాత్రం హాని చేయవు.

[27] మొసలికి ఇనుమును గడ్డి పరకలా విరుగ గొట్టడం తేలిక. ఇత్తడిని కుళ్లిపోయిన చెక్కలా విరుగ గొట్టటం తేలిక.

[28] బాణలు మొసలిని పారిపోయేటట్టు చేయలేవు. దానిమీద విసిరిన బండలు ఎండి గడ్డిపోచల్లా ఉంటాయి.

[29] దుడ్డు కర్రతో మొసలిని కొట్టినప్పుడు అది దానికి ఒక గడ్డి పరకలా అనిపిస్తుంది. మనుష్యులు దాని మీద ఈటెలు విసిరినప్పుడు అది నవ్వుతుంది.

[30] మొసలి శరీరం క్రింద ఉన్న చర్మం పగిలి పోయిన చాలా వాడి చిల్లపెంకుల్లా ఉంటుంది. అది నడిచి నప్పుడు మట్టిలో నురిపిడి కొయ్యలా గుంటలు చేస్తుంది.

[31] కాగుతున్న కుండలోని నీళ్లను అది బుడగల పొంగిస్తుంది. నూనె మసులుతున్న కుండలా అది నీటిని పొంగిస్తుంది.

[32] మొసలి ఈ దినప్పుడు దాని వెనుక ఒక దారి ఏర్పడుతుంది. అది నీళ్లను పొంగింప జేసినప్పుడు దాని వెనుక తెల్లని నురుగు ఉంటుంది.

[33] భూమి మీద ఏ జంతువూ మొసలిలాంటిది లేదు. అది భయం లేని జంతువుగా చేయబడింది.

[34] మహా గర్విష్ఠి జంతువులను మొసలి చిన్న చూపు చూస్తుంది. క్రూర జంతువులన్నిటికీ అది రాజు.” మరియు మొసలిని చేసినది నేనే, యెహోవాను.

యోబు — Chapters