Skip to content
Opens in a new window

[1] అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:

[2] “బిల్దదూ, జోఫరూ, ఎలీఫజూ మీరు బలహీనులైన మనుష్యలకు నిజంగా సహాయం చేయగలరు. అవును, మీరు నన్ను ప్రోత్సహించారు. బలహీనమైన నా చేతులను మీరు తిరిగి బలం గలవిగా చేసారు.

[3] అవును, జ్ఞానంలేని మనిషికి మీరు అద్భుతమైన సలహా ఇచ్చారు. మీరు చాలా జ్ఞానం ప్రదర్శించారు.

[4] ఈ సంగతులు చెప్పటానికి మీకు ఎవరు సహాయం చేశారు. ఎవరి ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించింది?

[5] “మరణించిన వారి ఆత్మలు భూమి కింద నీళ్లలో విలవిల్లాడుతున్నాయి.

[6] మరణ స్థలం దేవుని దృష్టికి బాహాటం. దేవునికి మరణం మరుగు కాదు.

[7] ఉత్తర ఆకాశాన్ని శూన్య అంతరిక్షంలో దేవుడు విస్తరింపజేశాడు. దేవుడు భూమిని శూన్యంలో వేలాడతీశాడు.

[8] మేఘాలను దేవుడు నీళ్లతో నింపుతున్నాడు. కానీ నీటి భారం మూలంగా మేఘాలు బద్దలు కాకుండా దేవుడు చూస్తాడు.

[9] పున్నమి చంద్రుని దేవుడు కప్పివేస్తాడు. దేవుడు తన మేఘాలను చంద్రుని మీద విస్తరింపచేసి, దానిని కప్పుతాడు

[10] మహా సముద్రం మీది ఆకాశపు అంచులను చీకటి వెలుగులకు మధ్య సరిహద్దుగా దేవుడు చేస్తాడు.

[11] ఆకాశాలను ఎత్తిపట్టు పునాదులను దేవుడు బెదిరించగా అవి భయంతో వణకుతాయి.

[12] దేవుని శక్తి సముద్రాన్ని నిశ్శబ్దం చేస్తుంది. దేవుని జ్ఞానము రాహాబు సహాయకులను నాశనం చేసింది.

[13] దేవుని శ్వాస ఆకాశాలను తేటపరుస్తుంది. తప్పించు కోవాలని ప్రయత్నించిన సర్పాన్ని దేవుని హస్తం నాశనం చేస్తుంది.

[14] దేవుని శక్తిగల కార్యాల్లో ఇవి కొన్ని మాత్రమే. దేవుని నుండి ఒక చిన్న స్వరం మాత్రమే మనం వింటాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడో, శక్తిగలవాడో ఏ మనిషి నిజంగా అర్థం చేసుకోలేడు.”

యోబు — Chapters