Skip to content
Opens in a new window

[1] అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు:

[2] “దేవుడే పాలకుడు. ప్రతి మనిషీ దేవునికి భయపడి గౌరవించాలి. దేవుడు తన పరలోక రాజ్యాన్ని శాంతిగా ఉంచుతాడు.

[3] దేవుని దూతలను ఏ మనిషీ లెక్కించలేడు. దేవుని సూర్యుడు మనుష్యులందరి మీద ఉదయిస్తాడు.

[4] కానీ దేవుని ఎదుట ఒక మనిషి నిజంగా మంచి వాడుగా ఉండలేడు. స్త్రీకి జన్మించిన మనిషి నిజంగా పరిశుద్ధంగా ఉండలేడు.

[5] దేవుని దృష్టికి చంద్రుడు కూడా ప్రకాశంగా ఉండడు. దేవుని దృష్టికి నక్షత్రాలు పరిశుద్ధంగా లేవు.

[6] మనిషి అంతకంటే తక్కువ. మనిషి మట్టి పురుగులాంటివాడు. పనికి మాలిన పురుగులాంటివాడు!”

యోబు — Chapters