[1] రెండో చీటి షిమ్యోనుకు, అంటే వారి కుటుంబాల ప్రకారం షిమ్యోను గోత్రికులకు వచ్చింది. వారి వారసత్వం యూదా గోత్రికుల వారసత్వం సరిహద్దులోనే ఉంది.
[2] వారి వారసత్వం ఏమిటంటే, బేర్‌షెబా, షెబి, మోలాదా,
[3] హజర్‌షువల్, బాలా, ఎజెం,
[4] ఎల్‌తోలదు, బేతూల్, హోర్మా,
[5] సిక్లగు, బేత్‌మర్కాబోదు, హజర్‌సూసా,
[6] బేత్‌లెబాయోతు, షారూహెను – ఈ పద్నాలుగు పట్టణాలూ వాటి గ్రామాలూ;
[7] అయీను, రిమ్మోను, ఎతెరు, ఆషాను – ఈ నాలుగు పట్టణాలూ వాటి గ్రామాలూ,
[8] ఈ పట్టణాల చుట్టూరా, బాలత్‌బేరు (దక్షిణం ఎడారిలో ఉన్న రామతు) వరకు ఉన్న గ్రామాలన్నీ. ఇది షిమ్యోను గోత్రంవారి కుటుంబాల వారసత్వం.
[9] షిమ్యోను వారి వారసత్వం యూదావారి ప్రదేశం లోనే ఉంది. ఎందుకంటే యూదావారి వాటా వారికి ఎక్కువైంది గనుక వారి వారసత్వంలలోనే షిమ్యోను గోత్రికులకు వారసత్వం వచ్చింది.
[10] మూడో చీటి జెబూలూను గోత్రంవారికి వారి కుటుంబాల ప్రకారం వచ్చింది. వారి వారసత్వం సరిహద్దు శారీదు వరకు పోయింది.
[11] అక్కడనుంచి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకు, దబ్బాషతు వరకు సాగి యొక్‌నెయాంకు ఎదురుగా ఉన్న ఏటివరకు వెళ్ళింది.
[12] శారీదు నుంచి తూర్పుగా ప్రొద్దు పొడిచేవైపు కిస్లోత్‌తాబోరు పొలిమేరవరకు వెళ్ళింది. అక్కడనుంచి దాబరెతుకు సాగి యాఫీయాకు ఎక్కింది.
[13] అక్కడనుంచి తూర్పుగా ప్రొద్దు పొడిచేవైపు గిత్తహెపెరుకు, ఇత్తాకాత్సీనుకు సాగి రిమ్మోనుగుండా నేయా వరకు పోయింది.
[14] ఉత్తరంగా సరిహద్దు హన్నాతోను వరకు చుట్టి వచ్చింది. అది యిప్తాయేల్ లోయలో అంతమైంది.
[15] అంతే కాకుండా కట్టాతు, నహలాల్, షిమ్రోను, ఇదలా, బేత్‌లెహేం వారికి వచ్చాయి. మొత్తం పన్నెండు పట్టణాలూ వాటి గ్రామాలూ.
[16] వారి కుటుంబాల ప్రకారం జెబూలూను వంశస్థుల వారసత్వం ఇది. ఈ పట్టణాలూ వాటి గ్రామాలూ వారికి వచ్చాయి.
[17] నాలుగో చీటి ఇశ్శాకారుకు వారి కుటుంబాల ప్రకారం ఇశ్శాకారు గోత్రానికి వచ్చింది.
[18] వారి ప్రాంతం యెజ్రేలు వరకు ఉంది. అందులో కెసుల్లోతు, షూనేం,
[19] హపరాయిం, షీయోను, అనహరాతు,
[20] రబ్బీతు, కిష్యోను, అబెసు,
[21] రెమెతు, ఏన్‌గన్నీం, ఏన్‌హద్దా, బేత్‌పస్సెసు ఉన్నాయి.
[22] ఆ సరిహద్దు తాబోరు, షహచీమా, బేత్‌షెమెషు చేరి యొర్దాను దగ్గర అంతమైంది. మొత్తం పదహారు పట్టణాలు వాటి గ్రామాలూ.
[23] వారి కుటుంబాల ప్రకారం ఇశ్శాకారు గోత్రికులు పొందిన వారసత్వం ఇది, వాటి గ్రామాలతో ఉన్న పట్టణాలు ఇవి.
[24] అయిదో చీటి ఆషేరు గోత్రంవారికి వారి కుటుంబాల ప్రకారం వచ్చింది.
[25] వారి సరిహద్దులో హెల్కతు, హలి, బెతెను, అక్లాప్,
[26] అలంమెలెకు, అమాదు, మిషేల్ ఉన్నాయి. పడమరగా ఆ సరిహద్దు కర్మెల్ షిహోర్‌లిబ్నాతు చేరింది.
[27] అక్కడనుంచి తూర్పుగా చుట్టి వచ్చి బేత్‌దగోనుకు వెళ్ళింది; జెబూలూనువారి సరిహద్దు, బేత్‌ఏమెకుకు నేయేల్‌కు ఉత్తరంగా ఉన్న యిప్తాయేల్ లోయకు చేరింది.
[28] అక్కడనుంచి ఉత్తరంగా కాబూల్‌కు, ఎబ్రోనుకు రెహోబ్‌కు, హమ్మోనుకు, కానాకు, పెద్ద సీదోనుకు వెళ్ళింది.
[29] అక్కడనుంచి సరిహద్దు రామావైపు తిరిగి తూర్ అనే ప్రాకార నగరం దాకా సాగింది. అక్కడనుంచి సరిహద్దు హోసాకు మళ్ళి మహా సముద్రతీరాన ఉన్న అక్‌జీబ్ దగ్గర అంతమైంది.
[30] ఉమ్మా, అఫెకు, రెహోబ్ కూడా వారి ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం ఇరవై రెండు పట్టణాలూ వాటి గ్రామాలూ.
[31] వారి కుటుంబాల ప్రకారం అషేరు గోత్రికులు పొందిన వారసత్వం ఇది; వాటి గ్రామాలతో ఉన్న పట్టణాలు ఇవి.
[32] ఆరో చీటి నఫ్తాలి గోత్రంవారికి వారి కుటుంబాల ప్రకారం వచ్చింది.
[33] వారి సరిహద్దు హెలెఫ్‌నుంచి జానన్నీం దగ్గర ఉన్న సిందూర వృక్షంనుంచి అదామెనెకెబ్‌కు, యబ్నేల్‌కు వెళ్ళి లక్కూం వరకు సాగింది. యొర్దానుదగ్గర అంతమైంది.
[34] అక్కడనుంచి సరిహద్దు పడమరగా తిరిగి అది అజనోత్‌తాబోరుకు వెళ్ళి అక్కడనుంచి హుక్కోకు వరకు సాగింది. అది దక్షిణంవైపు జెబూలూను సరిహద్దును తాకింది. పడమట ఆషేరు సరిహద్దును తాకింది. తూర్పుగా యొర్దాను దగ్గర యూదా సరిహద్దును తాకింది.
[35] ప్రాకారాలున్న వారి పట్టణాలు జిద్దీం, జేరు, హమ్మతు, రక్కతు, కిన్నెరెతు,
[36] అదామా, రమా, హాసోరు,
[37] కెదెషు, ఎద్రెయీ, ఏనహాసోరు,
[38] ఇరోను, మిగ్దలేల్, హోరేం, బేత్‌అనాతు, బేత్‌షెమెషు. మొత్తం గ్రామాలతోపాటు ఉన్న వారి పట్టణాలు పందొమ్మిది.
[39] వారి కుటుంబాల ప్రకారం నఫ్తాలిగోత్రికులు పొందిన వారసత్వం ఇది; వాటి గ్రామాలతో ఉన్న పట్టణాలివి.
[40] ఏడో చీటి దాను గోత్రంవారికి వారి కుటుంబాల ప్రకారం వచ్చింది.
[41] వారి వారసత్వం సరిహద్దు జొర్యా, ఎష్‌తాయోల్, ఇర్‌షెమెషు,
[42] షీలబీను, అయ్యాలోను, యెతా,
[43] ఏలోను, తిమ్నా, ఎక్రోను,
[44] ఎత్తెకే, గిబ్బెతోను, బాలాతా,
[45] యెహుదు, బెనేబరెకు, గాత్‌రిమ్మోను,
[46] మేయర్కోను, రక్కోను, యాపో ముందున్న ప్రాంతం.
[47] అయితే దాను గోత్రంవారి భూభాగం ఈ సరిహద్దులనుంచి అవతలకే విస్తరిల్లింది. దాను గోత్రంవారు బయలుదేరి లెషెంమీద యుద్ధం చేసి దానిని జయించి ఖడ్గంతో దాని నివాసులను చంపి దానిని స్వాధీనం చేసుకొని దానిలో కాపురం ఉన్నారు. ఆ లెషెంను వారి పూర్వీకుడు దాను పేరుతో ‘దాను’ అని పిలిచారు.
[48] వారి కుటుంబాలప్రకారం దాను గోత్రికులు పొందిన వారసత్వం ఇది. ఈ పట్టణాలూ వాటి గ్రామాలూ వారికి వచ్చాయి.
[49] ఇస్రాయేల్ ప్రజలు ఆ వారసత్వాల సరిహద్దులను నియమించి దేశాన్ని పంచుకోవడం ముగించాక వారు నూను కొడుకు యెహోషువకు ఒక వాటా వారసత్వంగా ఇచ్చారు.
[50] వారు యెహోవా ఆజ్ఞ అనుసరించి యెహోషువ అడిగిన ఊరు అతడికిచ్చారు. అతడు అడిగినది ఎఫ్రాయిం కొండ ప్రదేశంలోని తిమ్నాత్‌సెరహు. అతడు ఆ ఊరిని మళ్ళీ నిర్మించి అక్కడ కాపురం ఉన్నాడు.
[51] యాజియైన ఎలియాజరు నూను కొడుకు యెహోషువ, ఇస్రాయేల్‌ప్రజల గోత్రాల కుటుంబాల నాయకులు షిలోహులో యెహోవా సన్నిధానంలో సన్నిధిగుడారం ద్వారం దగ్గర చీట్లు వేసి పంచి ఇచ్చిన వారసత్వం భూములివి. ఈ విధంగా వారు దేశాన్ని పంచి పెట్టడం ముగించారు.