[1] యూదాగోత్రంవారికి వారి కుటుంబాల ప్రకారం చీట్లవల్ల వచ్చిన భూభాగం ఈ విధంగా ఉంది. అది ఏదోం దేశం సరిహద్దు వరకు, దక్షిణంగా సీన్ ఎడారికి చిట్టచివరి దక్షిణ భాగం వరకు ఉంది.
[2] వారి దక్షిణ సరిహద్దు ఉప్పు సరస్సు ఒడ్డునుంచి– దక్షిణంగా ఉన్న అఖాతం నుంచి– ఉంది.
[3] అది దక్షిణంగా అక్రబ్బీంకు ఎక్కుడు వెళ్ళి సీన్ వరకు పోయింది. అక్కడ అది కాదేష్‌బర్నెయాకు దక్షిణంగా ఎక్కి హెస్రోను మీదుగా అద్దారు వరకు వెళ్ళి అక్కడ కర్కాయువైపు తిరిగింది;
[4] అస్మోనుగుండా ఈజిప్ట్‌వాగు ప్రక్కగా వెళ్ళింది. ఇది మహా సముద్రం ఒడ్డువరకు ఉంది. ఇది మీ దక్షిణ సరిహద్దు.
[5] తూర్పు సరిహద్దు యొర్దాను చివరివరకు ఉన్న ఉప్పు సముద్రం. ఉత్తరంగా సరిహద్దు సముద్ర అఖాతంనుంచి – యొర్దాను చివరనుంచి – బయలు దేరింది.
[6] ఆ సరిహద్దు బేత్‌హోగ్లా వరకు వెళ్ళి బేత్‌అరాబాకు ఉత్తరంగా పోయింది. ఆ సరిహద్దు రూబేను కొడుకైన బోహాను రాయి వరకు వెళ్ళింది.
[7] ఆ సరిహద్దు ఆకోరు లోయనుంచి దెబీరు వరకు, అక్కడ నుంచి ఉత్తరంగా గిల్గాల్ వైపుకు వెళ్ళింది. అది అక్కడ లోయకు దక్షిణంగా ఉన్న అదుమ్మీంకు ఎక్కే చోటికి ఎదురుగా ఉంది. ఆ సరిహద్దు ఏన్ షేమెషు నీళ్ళ వరకు తరువాత ఏన్ రోగేల్‌కు వెళ్ళింది.
[8] అక్కడనుంచి ఆ సరిహద్దు బెన్‌హిన్నోం లోయ గుండా యెబూసివాళ్ళ ప్రాంతానికి దక్షిణం వాలువరకు – జెరుసలంవరకు – పోయింది. రెఫాయీంలోయకు చివర ఉత్తరంగా ఉన్న హిన్నోం లోయ పడమటి భాగంలో ఉన్న కొండ శిఖరం వరకు ఉంది.
[9] ఆ సరిహద్దు ఆ కొండ శిఖరంనుంచి నెఫ్తోయ నీటి ఊట వరకు వెళ్ళింది. అక్కడ నుంచి అది బయలా వైపు తిరిగింది. బయలా అంటే కిర్యాత్ యారీం.
[10] ఆ సరిహద్దు బయలానుంచి పడమటగా శేయీరు కొండవరకు చుట్టి ఉంది. కెసాలోను అనే యారీం కొండ ఉత్తర దిక్కుకు వెళ్ళి బేత్‌షెమెష్‌కు దిగి తిమ్నా మీదుగా పోయింది.
[11] ఆ సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరంగా సాగింది. అక్కడనుంచి షిక్రోనుకు చుట్టి వెళ్ళి బయలా కొండను దాటి యబనెయేల్‌కు వెళ్ళింది. మహా సముద్రం దగ్గర దాని పొలిమేర అవుతుంది.
[12] పశ్చిమ సరిహద్దు మహాసముద్రం, దాని తీరం. వారి కుటుంబాల ప్రకారం యూదా గోత్రంవారి సరిహద్దులివి.
[13] యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన ప్రకారం యెఫున్నె కొడుకు కాలేబుకు అతడు యూదా గోత్రం సరిహద్దు లోపల ఒక భాగాన్ని ఇచ్చాడు. అది కిర్యత్ అర్బా, అంటే హెబ్రోన్. (అర్బా అనాకు జాతివాళ్ళకు మూల పురుషుడు.)
[14] షేషయి, అహీం, తల్మయి అనే అనాకుయొక్క ముగ్గురు సంతతివాళ్ళను కాలేబు అక్కడనుంచి పారదోలాడు.
[15] కాలేబు అక్కడనుంచి దెబీరు పురవాసుల పైబడడానికి వెళ్ళాడు. దెబీరు పేరు అంతకుముందు కిర్యత్ సేఫరు.
[16] “కిర్యత్ సేఫెరును ఓడించి దాన్ని పట్టు కొన్నవాడికి నా కూతురు అక్సాను పెళ్ళి చేస్తాను” అని కాలేబు చాటించాడు.
[17] కాలేబు తోబుట్టువు కనజు కొడుకైన ఒతనీయేల్ ఆ ఊరును పట్టుకొన్నాడు గనుక కాలేబు అతడికి అక్సాను భార్యగా ఇచ్చాడు.
[18] ఆమె అతని దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రిని కొంత భూమి అడుగు దామని అతణ్ణి సమ్మతింపజేసింది. ఆమె వచ్చి గాడిదను దిగగానే “నీకేం కావాలమ్మా?” అని కాలేబు అడిగాడు.
[19] “నాకు అనుగ్రహం చూపండి. మీరు నన్ను దక్షిణ ఎడారి ప్రాంతంలో ఉంచారు. కనీసం కొన్ని ఊటలు కూడా నాకివ్వండి” అందామె. అందుచేత అతడు ఆమెకు ఎగువనున్న ఊటలూ, దిగువనున్న ఊటలూ ఇచ్చాడు.
[20] యూదాగోత్రానికి వారి కుటుంబాల ప్రకారం వారి వారసత్వం అది.
[21] యూదాగోత్రంవారి ప్రాంతానికి ఏదోం దేశం సరిహద్దువైపు దక్షిణంగా వచ్చిన పట్టణాలు: కబసెయేల్, ఏదెరు, యాగూరు,
[22] కేనా, దిమోనా, అదాదా,
[23] కాదేషు, హాసోరు, యిత్నాను,
[24] జీఫు, తెలెం, బెయాలోతు,
[25] హాసోర్ హదత్తా, కెరీయోతు, హాసోరు అనే హెస్రోను,
[26] అమాం, షేమ, మోలాదా,
[27] హసర్ గద్దా, హెష్మోను, బేత్‌పెలెతు,
[28] హసర్‌షువలు, బేర్‌షెబా, బిజ్యోత్యా,
[29] బలా, ఈయ్యె, ఎజెం,
[30] ఎల్ తోలదు, కెసీలు, హోర్మా,
[31] సిక్లగు, మద్‌మన్నా, సన్‌హన్నా,
[32] లెబాయోతు, షిల్హిం, అయీను, రిమ్మోను. ఆ పట్టణాలన్నీ ఇరవై తొమ్మిది. వాటి గ్రామాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
[33] దిగువ ప్రదేశంలో ఈ పట్టణాలు ఉన్నాయి: ఎష్‌తాయోలు, జొర్యా, అష్నా,
[34] జానోహా, ఏల్‌గన్నీం, తప్పూయ, ఏనాం,
[35] యర్మూతు, అదుల్లాం, శోకో, అజేకా,
[36] షరాయిం, అదీతాయిం, గెదేరా, గెదేరా ఓతాయిం. ఆ పట్టణాలు పద్నాలుగు. ఒక గ్రామం కూడా ఈ జాబితాలో ఉంది.
[37] సెనాను, హదాషా, మిగదోల్‌గాదు,
[38] దిలాను, మిస్పే, యొక్తయేల్,
[39] లాకీషు, బొస్కతు, ఎగ్లోను,
[40] కబ్బోను, లహ్మాసు, కిత్లిషు,
[41] గెదెరోతు, బేత్‌దాగోను, నయామా, మక్కేదా అనేవి పదహారు పట్టణాలు, వాటి గ్రామాలు.
[42] లిబ్నా, ఎతెరు, ఆషాను.
[43] యిస్తా, అష్నా, నెసీబ్,
[44] కెయిలా, అక్‌జీబ్, మారేషా వాటి గ్రామాలతో పాటు తొమ్మిది పట్టణాలు.
[45] ఎక్రోను, దాని ఊళ్ళూ, గ్రామాలూ,
[46] ఎక్రోనునుంచి మహా సముద్రంవరకు అష్డోదుకు దగ్గరగా ఉన్న పట్టణాలన్నీ, వాటి గ్రామాలు,
[47] అష్డోదు, దాని ఊళ్ళూ, గ్రామాలూ; గాజా, ఈజిప్ట్‌వాగు వరకు మహా సముద్రతీరం వరకు గాజా ఊళ్ళూ, గ్రామాలూ.
[48] కొండసీమలో ఈ పట్టణాలున్నాయి: షామీరు, యతీ, శోకో,
[49] దన్నా, కిర్యత్‌సన్నా (అదే దెబీరు),
[50] అనాబ్, ఎష్‌టెమో, ఆనీం,
[51] గోషెన్, హోలోన్, గిలో – పదకొండు పట్టణాలు, వాటి గ్రామాలు.
[52] ఆరాబ్, దూమా, ఎషాను,
[53] యానీం, బేత్‌తప్పూయ, అపెకా,
[54] హుంతా, కిర్యత్ అర్బా (అదే హెబ్రోను), సీయోరు– తొమ్మిది పట్టణాలు, వాటి గ్రామాలు.
[55] మయోను, కర్మెల్, జీఫ్, యుట్ట,
[56] యెజ్రేల్, యొక్‌దెయాం, జానోహ,
[57] కయీను, గిబియా, తిమ్నా – పది పట్టణాలు, వాటి గ్రామాలు.
[58] హల్‌హూల్, బేత్‌సూరు, గెదోరు,
[59] మారాతు, బేతనోతు, ఎల్‌తేకోను – ఆరు పట్టణాలు, వాటి గ్రామాలు.
[60] కిర్యత్ బయల్ (అదే కిర్యత్ యారీం), రబ్బా – రెండు పట్టణాలు, వాటి గ్రామాలు.
[61] ఎడారిలో బేత్ అరాబా, మిద్దీను, సెకాకా,
[62] నిబషాను, యీర్‌మెలఖు, ఎనగెదీ – ఆ ఆరు పట్టణాలు, వాటి గ్రామాలు ఉన్నాయి.
[63] కానీ జెరుసలంలో నివసించే యెబూసి జాతివాళ్ళను మాత్రం యూదా గోత్రంవారు వెళ్ళగొట్టలేకపోయారు. ఈ నాటికీ యెబూసివాళ్ళు యూదావారితో కలిసి జెరుసలంలో కాపురముంటున్నారు.