[1] ఇస్రాయేల్‌ప్రజలు యొర్దానుకు అవతల, ప్రొద్దు పొడిచే దిక్కున, అర్నోను లోయనుంచి హెర్మోను పర్వతంవరకు ఉన్న ప్రదేశాన్నీ తూర్పుగా ఉన్న అరాబా లోయ ప్రాంతమంతటినీ స్వాధీనం చేసుకొని అక్కడి రాజులను హతమార్చారు.
[2] ఆ రాజులలో ఒకడు అమోరీవాడు సీహోను. అతడు హెష్బోనులో ఉంటూ అర్నోను నది ఒడ్డున ఉన్న అరోయేర్‌నుంచి అక్కడి లోయ మధ్యభాగంనుంచి గిలాదు ప్రదేశంలో సగంవరకు, అమ్మోనువాళ్ళ సరిహద్దు యబ్బోకు నదివరకు పరిపాలించేవాడు.
[3] కిన్నెరెతు సరస్సు తూర్పుగా ఉన్న ప్రాంతంనుంచి అరాబాసరస్సు – అంటే ఉప్పు సరస్సు – తూర్పుగా ఉన్న బేత్ యేషీమోతుకు పోయే దారివరకు, దక్షిణంగా పిస్గాకొండ దిగువప్రాంతం వరకు ఉన్న అరాబా లోయ ప్రదేశాన్ని కూడా సీహోను పరిపాలించేవాడు.
[4] ఇస్రాయేల్‌వారు హతమార్చిన మరో రాజు బాషానురాజు ఓగు. అతడు మిగిలిన రెఫాయింలో ఒకడు.
[5] అష్తారోతులో, ఎద్రెయీలో నివసించి గెషూరివాళ్ళ, మాయకాతివాళ్ళ సరిహద్దువరకు బాషాను ప్రదేశాన్నంతా, సలేకాను, హెర్మోను పర్వత ప్రాంతాన్ని పరిపాలించేవాడు. హెష్బోను రాజైన సీహోను సరిహద్దులవరకు గిలాదు ప్రదేశంలో సగం భాగాన్నికూడా పరిపాలించేవాడు.
[6] యెహోవా సేవకుడైన మోషే, ఇస్రాయేల్‌ప్రజలు ఆ రాజులను హత మార్చారు. యెహోవా సేవకుడైన మోషే ఆ ప్రాంతాలను రూబేను గోత్రికులకూ గాదుగోత్రికులకూ మనష్షే అర్ధ గోత్రంవారికీ సొత్తుగా ఇచ్చాడు.
[7] యెహోషువ, ఇస్రాయేల్‌ప్రజలు యొర్దానుకు ఇవతల పడమటవైపు లెబానోను లోయలో ఉన్న బయల్ గాదు నుంచి శేయీరు పర్వతం సమీపమైన హలాక్ పర్వతంవరకు ఉన్న ప్రదేశాల రాజులను హతమార్చారు. ఆ భూములను ఇస్రాయేల్ వారి గోత్రాలకు ఆ గోత్ర విభజనప్రకారం యెహోషువ సొత్తుగా ఇచ్చాడు.
[8] కొండసీమలో, దిగువ ప్రదేశాలలో, ఎడారిలో, దక్షిణ ప్రదేశంలో హిత్తి, అమోరీ, కనాను, పెరిజ్జి, హివ్వి, యెబూసి జాతులవాళ్ళ భూములను ఇస్రాయేల్‌వారి గోత్రాల కిచ్చాడు. వారు హతమార్చిన రాజులు:
[9] యెరికో రాజు, బేతేల్‌ప్రక్క ఉన్న హాయీ రాజు,
[10] జెరుసలం రాజు, హెబ్రోను రాజు,
[11] యర్మూతు రాజు, లాకీషు రాజు,
[12] ఎగ్లోను రాజు, గెజెరు రాజు,
[13] దెబీరు రాజు, గెదెరు రాజు,
[14] హోర్మా రాజు, అరాదు రాజు,
[15] లిబ్నా రాజు, అదుల్లాం, రాజు,
[16] మక్కేదా రాజు, బేతేల్ రాజు,
[17] తప్పూయ రాజు, హెపెరు రాజు,
[18] ఆఫెకు రాజు, లష్షారోను రాజు,
[19] మాదోను రాజు, హాసోర్ రాజు,
[20] షిమ్రోన్‌మెరోను రాజు, అక్షాపు రాజు,
[21] తానాకు రాజు, మెగిద్దో రాజు,
[22] కెదెషు రాజు, కర్మెల్ పర్వతంలో యొక్‌నెయాం రాజు,
[23] దోరు ఎత్తయిన ప్రాంతంలో దోరు రాజు, గిల్గాల్‌లో ఉన్న గోయీంవాళ్ళ రాజు,
[24] తిర్సా రాజు. మొత్తం ముప్ఫయి యొక్కమంది రాజులు.