Skip to content
Opens in a new window

[1] ఇస్రాయేల్ ప్రజలందరి పేర్లూ తమ వంశాల ప్రకారం ఇస్రాయేల్ రాజుల గ్రంథంలో వ్రాసి నమోదయ్యాయి. యూదావారు దేవుని మీద ద్రోహం చేసినందుకు వారిని బబులోనుకు బందీలుగా తీసుకుపోవడం జరిగింది.

[2] తమ ఆస్తి, పట్టణాలలో మొదట కాపురమేర్పరచుకొన్నవారు ఎవరంటే, కొంతమంది ఇస్రాయేల్‌వారు, యాజులు, లేవీ గోత్రికులు, దేవాలయ సేవకులు.

[3] యూదావారిలో, బెన్‌యామీనువారిలో, ఎఫ్రాయింవారిలో, మనష్షే వారిలో జెరుసలంలో కాపురమున్నవారు వీరు:

[4] అమీహూదు కొడుకు ఊతయి (అమీహూదు ఒమ్రీ కొడుకు. ఒమ్రీ ఇమ్రీ కొడుకు. ఇమ్రీ బానీ కొడుకు. బానీ పెరెసు సంతతివాడు పెరెసు యూదా కొడుకు).

[5] షిలోనువారిలో మొదట పుట్టిన ఆశాయా, అతని కొడుకులు;

[6] జెరహు సంతతివారిలో యెవుయేల్, అతని బంధువులు. మొత్తం ఆరు వందల తొంభైమంది.

[7] బెన్‌యామీనువారిలో మెషుల్లాం కొడుకు సల్లు (మెషుల్లాం హోదవయా కొడుకు. హోదవయా హసెనూయా కొడుకు),

[8] యెరోహాం కొడుకు ఇబ్నీయా, మిక్రి మనుమడూ ఉజ్జీ కొడుకూ అయిన ఏలా, షెఫటయా కొడుకు మెషుల్లాం (షెఫటయా తండ్రి రగూయేల్, రగూయేల్ తండ్రి ఇబ్నీయా).

[9] వీరు, వీరి బంధువులు, తమ వంశాల జాబితాల ప్రకారం తొమ్మిది వందల యాభై ఆరుమంది. ఈ మనుషులందరూ తమ కుటుంబాలకు నాయకులు.

[10] యాజులలో వీరు జెరుసలంలో కాపురముండేవారు: యెదాయా, యెహోయారీబ్, యాకీను,

[11] దేవుని ఆలయంలో అధిపతీ హిల్కీయా కొడుకూ అయిన అజరయా (హిల్కీయా మెషుల్లాం కొడుకు, మెషుల్లాం సాదోకు కొడుకు, సాదోకు మెరాయోతు కొడుకు మెరాయోతు అహీటూబ్ కొడుకు),

[12] యెరోహాం కొడుకు అదాయా (యెరోహాం పశూర్ కొడుకు, పశూర్ మల్కీయా కొడుకు), అదియేల్ కొడుకు మశై (అదీయేల్ యహజేరా కొడుకు), యహజేరా మెషుల్లాం కొడుకు, మెషుల్లాం మెషిల్లేమీతు కొడుకు, మషిల్లేమీతు ఇమ్మేరు కొడుకు.

[13] వీరూ కుటుంబాల నాయకులైన వీరి బంధువులూ వెయ్యిన్ని ఏడు వందల అరవైమంది. దేవుని ఆలయ సేవ చేయడానికి వారు చాలా సామర్థ్యం గలవారు.

[14] లేవీగోత్రికులలో వీరు జెరుసలంలో కాపురముండేవారు: మెరారి సంతతివాడు, హష్షూబ్ కొడుకు షెమయా (హష్షూబ్ అజ్రీకాం కొడుకు, అజ్రీకాం హషబయా కొడుకు),

[15] బకబక్కరు, హెరెషు, గాలాల్, మీకా కొడుకు మత్తనయా (మీకా జిక్రీ కొడుకు, జిక్రీ ఆసాపు కొడుకు),

[16] షెమయా కొడుకు ఓబద్యా (షెమయా గాలాల్ కొడుకు, గాలాల్ యెదూతూను కొడుకు), ఎల్కానా మనుమడూ ఆసా కొడుకూ అయిన బెరెకయా. ఎల్కానా నెటోపాతీవారి గ్రామాలలో కాపురముండేవాడు.

[17] ఈ ద్వారపాలకులు జెరుసలంలో కాపురమున్నారు: షల్లూం, అక్కూబ్, టలమోను, అహీమాను, వారి బంధువులు. వీరిలో షల్లూం నాయకుడు.

[18] ఇదివరకు అతడు కాపాడవలసిన ద్వారం తూర్పుగా ఉన్న “రాజ ద్వారం”. వీరందరూ లేవీగోత్రికులలో ద్వారపాలకులు.

[19] కోరహుకు జన్మించిన ఎబియాసాపు మనుమడూ కోరె కొడుకూ అయిన షల్లూం, తన కోరహు వంశంలో ఉన్న తన బంధువులు ఆలయం ద్వారాన్ని కాపలా కాచే సేవ చేసేవారు. వారి పూర్వీకులు యెహోవా శిబిరానికి కాపలాదారులై ఉండి దాని ద్వారాన్ని కాచేవారు.

[20] పూర్వకాలంలో ఎలియాజరు కొడుకు ఫీనెహాసు ద్వారపాలకుల మీద అధికారిగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు.

[21] మెషెలెమయా కొడుకు జెకర్యా సన్నిధిగుడారం ద్వారానికి కావలివాడు.

[22] గడపల దగ్గర ద్వారపాలకులుగా ఎన్నుకోబడ్డ వారందరూ రెండు వందల పన్నెండుమంది. వారు తమ గ్రామాలలో తమ వంశాల ప్రకారం నమోదైనవారు. వారు నమ్మతగ్గవారని దావీదు, దీర్ఘదర్శి అయిన సమూయేలు వారిని నియమించారు.

[23] వారికీ వారి సంతతివారికీ యెహోవా నివాసమైన గుడారం ద్వారాలకు కావలి కాచే బాధ్యత ఉంది.

[24] ద్వారపాలకులు నాలుగు వైపులా – తూర్పున, పడమర, ఉత్తరాన, దక్షిణాన – ఉన్నారు.

[25] వారి బంధువులు కాలక్రమం చొప్పున తమ గ్రామాల నుంచి వచ్చి ఏడు రోజులు వారిదగ్గర గడిపి వారికి సహాయం చేసేవారు.

[26] ప్రముఖ ద్వారపాలకులు నలుగురు. వారు కూడా లేవీ గోత్రికులు. వారు బాధ్యత వహించవలసినవారై దేవుని ఆలయం గదుల మీదా ఖజానాల మీదా నియమించబడ్డారు.

[27] వారు దేవుని ఆలయానికి కాపలాదారులు గనుక దాని చుట్టూరా రాత్రి గడిపేవారు. ప్రతి ఉదయం దాని తలుపులు తెరచేవారు.

[28] ద్వారపాలకులలో కొంతమంది ఆలయ సేవ సామానును చూచేవారు. ఆ వస్తువులు లోపలికి తెచ్చినప్పుడు, బయటికి తీసుకుపోయినప్పుడు వారు లెక్కపెట్టేవారు.

[29] మరికొందరు మిగతా సామానునూ, పవిత్ర స్థానం పాత్రలన్నిటినీ చూచే బాధ్యతకు నియమించబడ్డవారు. మెత్తని పిండి, ద్రాక్షరసం, నూనె, ధూపద్రవ్యం, సంభారం వారి అధీనంలో ఉన్నాయి.

[30] అయితే యాజులలో కొంతమంది ధూపం కోసం సుగంధ ద్రవ్యాలను కలిపేవారు.

[31] కోరహు వంశంవాడు షల్లూంకు మొదట పుట్టినవాడై మత్తితయా అనే లేవీగోత్రికుడు రొట్టెలు చేసే పని చూచేవాడు.

[32] వారి బంధువులైన కహాత్ వంశీయులలో కొంతమందికి ప్రతి విశ్రాంతి దినంకోసం సన్నిధి రొట్టెలు సిద్ధం చేసే బాధ్యత ఉంది.

[33] లేవీగోత్రికులలో గాయకులు కుటుంబాల నాయకులై ఉంటే, దేవాలయం గదులలో కాపురముండేవారు. రాత్రింబగళ్ళు తమ పనిలో నిమగ్నులు కావడంచేత వారికి వేరే పని నియమించబడలేదు.

[34] వీరందరూ లేవీగోత్రకుటుంబాల పెద్దలు, తమ వంశాలప్రకారం నాయకులు. వారు జెరుసలంలోనే కాపురముండేవారు.

[35] యెహీయేల్ గిబియోనుకు తండ్రి. అతడు గిబియోను పట్టణంలో కాపురముండేవాడు. అతని భార్య పేరు మయకా.

[36] అతనికి మొదట పుట్టినవాడు అబ్దోను. తరువాత సూర్, కీషు, బేల్, నేర్, నాదాబ్,

[37] గెదోరు, అహియో, జెకర్యా, మికలోతు జన్మించారు.

[38] మికలోతుకు షిమయాను జన్మించాడు. వీరు కూడా జెరుసలంలో తమ బంధువులదగ్గర కాపురముండేవారు.

[39] నేర్‌కు కీషు జన్మించాడు. కీషుకు సౌలు జన్మించారు. సౌలుకు యోనాతాను, మెల్కిషూవ, అబీనాదాబ్, ఎష్‌బేల్ జన్మించారు.

[40] యోనాతాను కొడుకు మెరీబ్బేల్. మెరీబ్బేల్‌కూ మీకా జన్మించాడు.

[41] మీకా కొడుకులు: పీతోను, మెలెకు, తరేయ, ఆహాజ్.

[42] ఆహాజ్‌కు యరా జన్మించాడు. యరాకు ఆలెమెతు, అజమావెతు, జిమ్రీ జన్మించారు. జిమ్రీకి మోజా జన్మించాడు.

[43] మోజాకు బినయా జన్మించాడు. బినయా కొడుకు రెఫాయా. రెఫాయా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేల్.

[44] ఆజేల్‌కు ఆరుగురు కొడుకులున్నారు. వారి పేర్లు అజ్రీకాం, బోకెరు, ఇష్మాయేల్, షెయరయా, ఓబద్యా, హానాను. వీరు ఆజేల్ కొడుకులు.

1 దినవృత్తాంతాలు — Chapters