[1] యూదా కొడుకులు పెరెసు, హెష్రోను, కర్మీ, హూర్, శోబాల్.
[2] శోబాల్ కొడుకైన రెవాయాకు యహతు జన్మించాడు. యహతుకు అహూమయి, లహదు జన్మించారు. అవి సొరాతివారి కుటుంబాలు.
[3] అబీయేతాం సంతతివారు: యెజ్రేల్, ఇష్మా, ఇద్‌బాషు. వీరి సోదరి పేరు హజ్జెలెల్‌పోని.
[4] పెనూయేల్‌కు గెదోరు జన్మించాడు. ఏజెరుకు హూషా జన్మించాడు. వీరందరూ హూర్ సంతతివారు. హూర్ ఎఫ్రాతాకు జ్యేష్ఠుడు, బేత్‌లెహేంకు తండ్రి.
[5] తెకోవ తండ్రి అయిన అష్షూరుకు హెలా, నయరా అనే ఇద్దరు భార్యలున్నారు.
[6] నయరావల్ల అతనికి అహుజాం, హెపెరు, తేమనీ, హాయహష్తారీ జన్మించారు. వీరు నయరా కన్న కొడుకులు.
[7] హెలా కొడుకులు: జెరెతు, సోహరు, ఎత్నాను, కోజ్.
[8] కోజ్ ఆనూబ్‌కు, జోబేబాకు, హారుం కొడుకైన అహర్‌హేల్ కుటుంబాలకు తండ్రి.
[9] యబ్బేజ్ తన సోదరులకంటే ఘనుడయ్యాడు. అతని తల్లి “బాధతో ఇతణ్ణి కన్నాను” అని చెప్పి అతనికి యబ్బేజ్ అని పేరు పెట్టింది.
[10] యబ్బేజ్ ఇస్రాయేల్ ప్రజల దేవునికి ఇలా మొర పెట్టాడు: “నీవు నన్ను రూఢిగా దీవించు. నా భూమి విశాలంగా చెయ్యి. నీ చేయి నాకు తోడుగా ఉండనిచ్చి, కీడు నన్ను బాధపెట్టకుండా దాని నుంచి నన్ను కాపాడు. దేవుడు అతని మనవి అంగీకరించి దాని ప్రకారం జరిగించాడు.
[11] షూవహు సోదరుడైన కెలూబ్‌కు మెహీరు జన్మించాడు. మెహీరుకు ఎష్తోను జన్మించాడు.
[12] ఎష్తోనుకు బేత్‌రాఫా, పాసెయ, తెహిన్నా జన్మించారు. తెహిన్నా ఈర్‌నాహాషుకు తండ్రి. వీరందరూ రేకావారు.
[13] కనజ్ కొడుకులు ఒత్‌నీయేల్, శెరాయా. ఒతనీయేల్ కొడుకులు హతతు, యెయానొతయి.
[14] యెయానొతయికు ఒఫ్రా జన్మించాడు. శెరాయాకు యోవాబ్ జన్మించాడు. యోవాబ్ “లోహకారుల” లోయలో నివసించేవారికి పూర్వీకుడు. ఆ లోయలో ఉన్నవారంతా లోహకారులు.
[15] యెఫున్నె కొడుకైన కాలేబు కొడుకులు: ఈరూ, ఏలా, నయం. ఏలా కొడుకు: కనజ్.
[16] యెహల్లెలేల్ కొడుకులు: జీఫు, జీఫా, తీరయా, అశరయేల్.
[17] ఎజ్రా కొడుకులు: యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్యలలో ఒకతె మిర్యాంనూ, షమ్మయినీ, ఇష్‌బాహునూ కన్నది. ఇష్‌బాహు ఎష్‌టెమోయకు తండ్రి.
[18] యెరెదు పెళ్ళిచేసుకొన్న ఫరో కూతురైన బిత్యా కన్న కొడుకులు వీరే. యూదురాలైన అతని భార్యకు గెదోరు తండ్రి అయిన యెరెదు, శోకో తండ్రి అయిన హెబెరు, జానోహ తండ్రి అయిన యెకూతీయేల్ జన్మించారు.
[19] నహం సోదరీ, హూదీయా భార్య అయిన స్త్రీకి జన్మించిన కొడుకులు. గర్మీవాడైన కెయిలా తండ్రి, మాయకాతువాడైన ఎష్‌టెమోయ.
[20] షీమోను కొడుకులు: అమ్నోను, రిన్నా, బెన్‌హానాను, తీలోను. ఇషీ కొడుకులు: జోహేతు, బెన్‌జోహేతు.
[21] యూదా కొడుకైన షీలహు కొడుకులు: లేకా తండ్రి ఏర్, మారేషా తండ్రీ, బేత్ అష్బీయలో ఉన్న సన్నని నారబట్ట నేసేవారి పూర్వీకుడూ అయిన లద్దా,
[22] యోకీం, కోజేబావారు, యోవాషు, మోయాబుదేశంలో పరిపాలన చేసిన శారాపు, యాషూబిలెహెం (ఇవి చాలా కాలం క్రిందట వ్రాసిపెట్టిన సంగతులు).
[23] వారు నెతాయీంలో, గెదేరాలో నివసించే కుమ్మరివాళ్ళు. వారు రాజు దగ్గర నివసించి రాజు కోసం పని చేసేవారు.
[24] షిమ్యోను సంతతివారు: నెమూయేల్, యామీన్, యారీబ్, జెరహు, షావూల్.
[25] షావూల్ కొడుకు షల్లూం, షల్లూం కొడుకు మిబ్‌శాం. మిబ్‌శాం కొడుకు మిష్మా.
[26] మిష్మా సంతతివారు: మిష్మా కొడుకు హమ్మూయేల్, హమ్మూయేల్ కొడుకు జక్కూరు, జక్కూరు కొడుకు షిమీ.
[27] షిమీకి పదహారు మంది కొడుకులు, ఆరుగురు కూతుళ్ళు జన్మించారు. అయితే అతని అన్నదమ్ములకు చాలా మంది పిల్లలు కలగలేదు. యూదావారు వృద్ధి అయినట్టు వారి వంశమంతా వృద్ధికాలేదు.
[28] వారు నివాసం చేసిన పట్టణాలు బేర్‌షెబా, మోలాదా, హజర్ షువల్,
[29] బిలహా, ఎజెం, తోలాదు,
[30] బెతూయేల్, హోర్మా, సిక్లగు,
[31] బేత్ మర్కాబోతు, హజరుసూసీం, బేత్‌బీరీ, షరాయిం. దావీదు పరిపాలన వరకు వారు ఆ పట్టణాలలో కాపురమున్నారు.
[32] వారి ఊళ్ళు అయిదు – ఏతాం, అయూను, రిమ్మోను, తోకెను, ఆషాను.
[33] బేల్ వరకు ఆ పట్టణాల చుట్టూరా ఉన్న గ్రామాలన్నీ వారివి. ఇవి వారి నివాసస్థలాలు. వంశావళి పట్టీలు వారికి ఉన్నాయి.
[34] మెషోబాబ్, యమ్లేకు, అమజ్యా కొడుకైన యోషా,
[35] యోవేల్, అశీయేల్‌కు జన్మించిన శెరాయా మనుమడూ యోషిబయా కొడుకూ అయిన యెహూ,
[36] ఎల్‌యోయేనయి, యాహకోబా, యెషోయాయా, అశాయా, అదీయేల్, యెశీమీయేల్, బెనాయా,
[37] షిపి కొడుకు జీజా. షిపి తండ్రి అల్లోను. అల్లోను తండ్రి యదాయా. యదాయా తండ్రి షిమ్రీ. షిమ్రీ తండ్రి షెమయా.
[38] ఈ వంశవృక్షంలో ఎవరి పేర్లు వ్రాసి ఉన్నాయో వారు తమ కుటుంబాలకు నాయకులు. ఈ కుటుంబాలు అధికంగా వృద్ధి అయ్యాయి.
[39] వారు తమ మందలకోసం మేత వెదకడానికి లోయలో తూర్పుగా ఉన్న గెదోరు వరకు వెళ్ళారు.
[40] అక్కడ మంచి బలమైన మేత దొరికింది. ఆ ప్రాంతం విశాలమైనది, నెమ్మదిగా ప్రశాంతంగా ఉంది. మునుపు హాము వంశంవారిలో కొంతమంది అక్కడ కాపురముండేవారు.
[41] ఆ వంశవృక్షంలో పేర్లున్న వీరు హిజ్కియా రోజులలో అక్కడికి వెళ్ళి, హాము వంశంవారినీ, అక్కడున్న మయోను వాళ్ళనూ హతం చేసి, వాళ్ళ ఇండ్లను పడగొట్టారు. తమ మందలకు మేత దొరికినందుచేత వాళ్ళ స్థలంలో కాపురమేర్పరచుకొన్నారు. నేటి వరకు వారు అక్కడ ఉన్నారు.
[42] ఈ షిమ్యోను వంశంవారిలో అయిదు వందల మంది శేయీర్ కొండసీమకు వెళ్ళారు. ఇషీ కొడుకులైన పెలటయా, నెయరయా, రెఫాయా, ఉజ్జీయేల్ వారికి నాయకులు.
[43] అమాలేకు జాతివారిలో తప్పించుకొని అక్కడ కాపురమున్న మిగతా వాళ్ళను హతం చేశారు. నేటి వరకు వారు అక్కడ నివాసం చేస్తున్నారు.