Skip to content
Opens in a new window

[1] ఆసాపు, హేమాను, యెదూతూను అనేవారి కొడుకులలో కొంతమందిని దావీదు, సైన్యాధిపతులు ప్రత్యేక సేవకు నియమించారు. వారి సేవ తంతివాద్యాలూ తాళాలూ వాయిస్తూ దేవుణ్ణి గురించి ప్రకటించడం. ఈ సేవ చేసేవారి జాబితా ఇది:

[2] ఆసాపు కొడుకులలో జక్కూరు, యోసేపు, నెతనయా, అషరయేలా. వీరు ఆసాపు నడుపుదల ప్రకారం ప్రకటించేవారు; ఆసాపు రాజు నడుపుదల ప్రకారం ప్రకటించేవాడు.

[3] యెదూతూను కొడుకులలో గెదలయా, జెరీ, యెషయా, షిమీ, హషబయా, మత్తితయా అనే ఆరుగురు. వీరు వారి తండ్రి యెదూతూను నడుపుదల క్రింద ఉండి ప్రకటించేవారు. యెదూతూను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు అర్పించేటప్పుడు తంతివాద్యం వాయిస్తూ ప్రకటించేవాడు.

[4] హేమాను కొడుకులలో బక్కీయా, మత్తనయా, ఉజ్జీయేల్, షెబూయేల్, యెరీమోతు, హననయా, హనానీ, ఎలీయాతా, గిద్దలతీ, రోమమతీయెజెరు, యోషబెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు ప్రకటించేవారు.

[5] వీరంతా రాజుకు దీర్ఘదర్శిగా ఉన్న హేమాను కొడుకులు. తన వాగ్దానాల ప్రకారంగా హేమానును గొప్పచేయడానికి దేవుడు వారిని హేమానుకు ప్రసాదించాడు. దేవుడు హేమానుకు పద్నాలుగురు కొడుకులనూ ముగ్గురు కూతుళ్ళను అనుగ్రహించాడు.

[6] వీరంతా తమ తండ్రి నడుపుదల ప్రకారం యెహోవా ఆలయంలో తాళాలూ తంతివాద్యాలూ వాయిస్తూ, పాటలు పాడుతూ, దేవాలయంలో సేవ చేస్తూ ఉండేవారు. ఆసాపు, యెదూతూను, హేమాను రాజు నడుపుదల క్రింద ఉండేవారు.

[7] యెహోవాకు గానం చేయడంలో నేర్పు పొందిన వీరి బంధువులతో కూడా ఈ ప్రవీణులందరి లెక్క రెండు వందల ఎనభై ఎనిమిది.

[8] పిన్న అనీ పెద్ద అనీ, గురువనీ శిష్యుడనీ భేదం లేకుండా తమ బాధ్యతల విషయం చీట్లు వేసి వంతులు పంచుకొన్నారు.

[9] మొదటి చీటి ఆసాపు కుటుంబంలో ఉన్న యోసేపుకు పడింది. అతడూ అతడి బంధువులూ కొడుకులూ పన్నెండుగురు. రెండోది గెదలయాకు పడింది. అతడూ అతడి బంధువులూ కొడుకులూ పన్నెండుగురు.

[10] మూడోది జక్కూరుకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[11] నాలుగోది యిజ్రీకి పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[12] అయిదోది నెతనయాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[13] ఆరోది బక్కీయాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[14] ఏడోది యెషరయేలాకు పడింది. అతడూ అతడి కొడుకులు బంధువులూ పన్నెండుగురు.

[15] ఎనిమిదోది యెషయాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[16] తొమ్మిదోది మత్తనయాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[17] పదోది షిమీకి పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[18] పదకొండోది అజరేల్‌కు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[19] పన్నెండోది హషబయాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[20] పదమూడోది షూబాయేల్‌కు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[21] పద్నాలుగోది మత్తితయాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[22] పదిహేనోది యెరేమోతుకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[23] పదహారోది హననయాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[24] పదిహేడోది యొషబెకాషాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[25] పద్ధెనిమిదోది హనానీకి పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[26] పందొమ్మిదోది మల్లోతికి పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[27] ఇరవైయ్యోది ఎలీయాతాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[28] ఇరవై యొకటోది హోతీరుకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[29] ఇరవై రెండోది గిద్దత్తీకి పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[30] ఇరవై మూడోది మహజీయోతుకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు.

[31] ఇరవై నాలుగోది రోమమతీయెజెరుకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుమంది.

1 దినవృత్తాంతాలు — Chapters