[1] ఇస్రాయేల్ కొడుకులు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాకారు, జెబూలూను,
[2] దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు.
[3] యూదా కొడుకులు: ఏర్, ఓనాను, షేలా. ఈ ముగ్గురు షూయ కూతురుకు జన్మించారు. ఆమె కనాను స్త్రీ. యూదాకు జ్యేష్ఠకుమారుడు ఏర్ యెహోవా దృష్టిలో చెడ్డవాడు గనుక ఆయన వాణ్ణి చావుకు గురి చేశాడు.
[4] యూదా కోడలు తామారు అతనికి పెరెసునూ జెరహునూ కన్నది. యూదా కొడుకులందరూ అయిదుగురు.
[5] పెరెసు కొడుకులు: హెస్రోను, హామూల్.
[6] జెరహు కొడుకులు: జిమ్రీ, ఏతాను, హేమాను, కల్‌కోల్, దార. వారు అయిదుగురు.
[7] కర్మీ కొడుకు: ఆకాను. అతడు నిషిద్ధమైన దానిలో కొంత తీసుకొని ఇస్రాయేల్ ప్రజలకు బాధ కలిగించాడు.
[8] ఏతాను కొడుకు: అజరయా.
[9] హెస్రోనుకు జన్మించిన కొడుకులు: యెరమేల్, రమ్, కెలూబై.
[10] రమ్కు అమ్మీనాబాద్ జన్మించాడు. అమ్మీనాబాద్‌కు నయస్సోను జన్మించాడు. అతడు యూదా ప్రజల నాయకుడు.
[11] నయస్సోనుకు శల్మాను జన్మించాడు. శల్మానుకు బోయజు జన్మించాడు.
[12] బోయజుకు ఓబేదు జన్మించాడు. ఓబేదుకు యెష్షయి జన్మించాడు.
[13] యెష్షయికి జన్మించిన వారు: మొదటివాడు ఏలీయాబ్, రెండోవాడు అబీనాదాబ్, మూడో వాడు షమ్మా,
[14] నాలుగోవాడు నెతనేల్, అయిదోవాడు రద్దయి,
[15] ఆరోవాడు ఓజెం, ఏడోవాడు దావీదు.
[16] వారి సోదరీలు: సెరూయా, అబీగయీల్. సెరూయా కొడుకులు ముగ్గురు: అబీషై, యోవాబ్, అశాహేల్.
[17] అబీగయీల్ అమాశాను కన్నది. ఇష్మాయేల్‌వాడైన యెతెరు అమాశాకు తండ్రి.
[18] హెస్రోను కొడుకు కాలేబ్‌కు అతని భార్య అయిన అజూబా పిల్లలను కన్నది. అతనికి యెరీయోతు కూడా పిల్లలను కన్నది. అజూబా కొడుకులు: యేషెరు, షోబాబ్, అర్దోను.
[19] అజూబా చనిపోయిన తరువాత కాలేబ్ ఏఫ్రాతాను పెళ్ళిచేసుకొన్నాడు. ఆమె అతనికి హూర్‌ను కన్నది.
[20] హూర్‌కు ఊరి జన్మించాడు. ఊరికి బసెలేల్ జన్మించాడు.
[21] తరువాత హెస్రోను మాకీరు కూతురుతో శయనించాడు. మాకీరు గిలాదుకు తండ్రి. హెస్రోను మాకీరు కూతురును పెళ్ళి చేసుకొన్నప్పుడు అతని వయసు అరవై ఏళ్ళు. ఆమె అతనికి సెగూబ్‌ను కన్నది.
[22] సెగూబ్‌కు యాయీరు జన్మించాడు. యాయీరుకు గిలాదు ప్రదేశంలో ఇరవై మూడు ఊళ్ళు ఉన్నాయి.
[23] అయితే గెషూరు, అరాం యాయీరు ఊళ్ళనూ కెనాతునూ, కెనాతుకు చెందిన ఊళ్ళనూ – మొత్తం అరవై ఊళ్ళను – యాయీరువారి వశం నుంచి తీసుకొన్నారు. వీరందరూ గిలాదు తండ్రి మాకీరు సంతతివారు.
[24] కాలేబ్ ఎఫ్రాతా అనే స్థలంలో హెస్రోను చనిపోయిన తరువాత అతని భార్య అయిన అబీయా అతనికి అష్షూరును కన్నది. అష్షూరు తెకోవకు తండ్రి.
[25] హెస్రోనుకు మొదట పుట్టినవాడైన యెరమేల్ కొడుకులు: మొదటివాడు రమ్, బూనా, ఓరెను, ఓజెం, అహీయా.
[26] అటారా అనే ఇంకొక భార్య యెరమేల్‌కు ఉంది. ఆమె ఓనాంకు తల్లి.
[27] యెరమేల్‌కు మొదట పుట్టినవాడైన రమ్ కొడుకులు: మయజ్, యామిన్, ఏకెరు.
[28] ఓనాం కొడుకులు: షమ్మయి, యాదా. షమ్మయి కొడుకులు: నాదాబ్, అబీషూర్.
[29] అబీషూర్ భార్య పేరు అబీహాయిల్. ఆమె అతనికి అబానును, మొలీదును కన్నది.
[30] నాదాబ్ కొడుకులు: సెలెదు, అప్పయీం. సెలెదు సంతానం లేక చనిపోయాడు.
[31] అప్పయీం కొడుకు: ఇషీ. ఇషీకి షేషాను జన్మించాడు. షేషానుకు అలయి జన్మించాడు.
[32] షమ్మాయి సోదరుడైన యాదా కొడుకులు: యెతెరు, యోనాతాను. యెతెరు సంతానం లేక చనిపోయాడు.
[33] యోనాతాను కొడుకులు: పేలెతు, జాజా. వీరు యెరహెమేల్ సంతతివారు.
[34] షేషానుకు కొడుకులు లేరు. కూతుళ్ళే జన్మించారు. షేషానుకు యరహా అనే ఒక సేవకుడు ఉన్నాడు. అతడు ఈజిప్ట్‌వాడు.
[35] షేషాను తన కూతురును తన సేవకుడైన యరహాకు పెళ్ళి చేశాడు. ఆమె అతనికి అత్తయిని కన్నది.
[36] అత్తయికి నాతాను జన్మించాడు. నాతానుకు జాబాదు జన్మించాడు.
[37] జాబాదుకు ఎప్లాల్ జన్మించాడు. ఎప్లాల్‌కు ఓబేదు జన్మించాడు.
[38] ఓబేదుకు యెహూ జన్మించాడు. యెహూకు అజరయా జన్మించాడు.
[39] అజరయాకు హేలెస్సు జన్మించాడు. హేలెస్సుకు ఎలాశా జన్మించాడు.
[40] ఎలాశాకు సిస్మాయీ జన్మించాడు. సిస్మాయీకి షల్లూం జన్మించాడు.
[41] షల్లూంకు యెకమయా జన్మించాడు. యెకమయాకు ఎలీషామా జన్మించాడు.
[42] యెరమేల్ తమ్ముడైన కాలేబ్ కొడుకులు: మారెషా, మొదటపుట్టినవాడు మేషా. మేషాకు జీపు జన్మించాడు. మారెషా హెబ్రోనుకు తండ్రి.
[43] హెబ్రోను కొడుకులు: కోరహు, తప్పూయ, రేకెం, షెమ.
[44] షెమకు రహం జన్మించాడు. రహంకు యోరకెయాం జన్మించాడు. రేకెంకు షమ్మయి జన్మించాడు.
[45] షమ్మయి కొడుకు మాయోను. మాయోను బేత్‌సూర్‌కు తండ్రి.
[46] కాలేబ్ ఉంపుడుకత్తె ఏయిఫాకు హారాను, మోజా, గాజేజ్ జన్మించారు. హారానుకు గాజేజ్ జన్మించాడు.
[47] యెదయి కొడుకులు: రెగెం, యోతాం, గేషాను, పెలెట, ఏయిఫా, షయపు.
[48] కాలేబ్ ఉంపుడుకత్తె మయకాకు షెబెరు, తిర్‌హనాను జన్మించారు.
[49] ఆమెకు మద్‌మన్నా తండ్రి షయపు, మక్‌బేనా, గిబయాల తండ్రి షెవా కూడా జన్మించారు. కాలేబ్ కూతురు అక్సా.
[50] కాలేబ్ సంతతివారు: ఎఫ్రాతాకు మొదట పుట్టిన హూర్ కొడుకులు శోబాల్, శల్మా, హారేపు.
[51] శోబాల్‌కు కిర్యత్‌యారీం జన్మించాడు. శల్మాకు బేత్‌లెహేం జన్మించాడు. హారేపుకు బేత్ గాదేర్ జన్మించాడు.
[52] కిర్యత్‌యారీం తండ్రి శోబాల్ సంతతివారు: హారోయే, మనుహోతువారిలో సగం మంది,
[53] కిర్యత్‌యారీం కుటుంబాలు – ఇత్రీవారు, పూతీవారు, షుమ్మాతివారు, మిష్రాయీవారు. వీరివల్ల సొరాతివారు, ఎష్తాయుల్‌వారు కలిగారు.
[54] షల్మా సంతతివారు: బేత్‌లెహేం, నెటోపాతివారు, అతారోతు, బేత్‌యోవాబ్, మనుహోతువారిలో సగంమంది, జారీవారు,
[55] యబ్బేజులో కాపురమున్న లేఖకుల కుటుంబాలు – తిరాతివారు, షిమ్యాతివారు, శూకోతివారు. వీరు హమాతుకు కలిగిన కేనువారు. హమాతు రేకాబ్ వంశానికి ఆదిపురుషుడు.