Skip to content
Opens in a new window

[1] ఇశ్శాకారు కొడుకులు నలుగురు: తోలా, పువ్వా, యాషూబ్, షిమ్రోను.

[2] తోలా కొడుకులు ఉజ్జీ, రెఫాయా, యెరీయేల్, యహమయి, యిబ్‌షాం, సమూయేల్. వీరు వంశాల నాయకులు, తమ తరాలలో పరాక్రమశాలురు. దావీదు రోజుల్లో తోలా సంతతివారు ఇరవై రెండు వేల ఆరువందల మంది.

[3] ఉజ్జీ కొడుకు ఇజ్రహయా. ఇజ్రహయా కొడుకులు మికాయేల్, ఓబద్యా, యోవేల్, ఇష్షీయా. వీరు అయిదుగురు నాయకులు.

[4] వారి సంతతివారికి చాలా మంది భార్యలు, పిల్లలు కలగడంచేత వారి వంశావళి ప్రకారం వారిలో ముప్ఫయి ఆరు వేల మంది యుద్ధ సన్నద్ధులున్నారు.

[5] ఇశ్శాకారు కుటుంబాలన్నిటికీ చెందిన వీరి బంధువులలో, వారి వంశవృక్షాల ప్రకారం, పరాక్రమశాలురుగా ఉన్నవారు ఎనభై ఏడు వేల మంది.

[6] బెన్యామీను ముగ్గురు కొడుకులు: బెల, బకేరు, యెదీయేల్.

[7] బెల కొడుకులు అయిదుగురు: ఎసబోను, ఉజ్జీ, ఉజ్జీయేల్, యెరీమోతు, ఈరీ. వీరు వంశ నాయకులు, పరాక్రమశాలురు. వీరి వంశవృక్షంలో నమోదైనవారు ఇరవై రెండు వేల ముప్ఫయి నలుగురు.

[8] బకేర్ కొడుకులు: జెమీరా, యోవాష్, ఎలీయెజెర్, ఎల్‌యోయేనయి, ఒమ్రీ, యెరీమోత్, అబీయా, అనాతోత్, ఆలెమెత్. వీరందరూ బకేర్ కొడుకులు.

[9] వీరు తమ వంశాల నాయకులు. వారి వంశావళిలో నమోదైనవారు ఇరవైవేల రెండు వందల మంది పరాక్రమశాలురు.

[10] యెదీయేల్ కొడుకు: బిల్‌హాను. బిల్‌హాను కొడుకులు: యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్‌షీషు, అహీషహరు.

[11] యెదీయేల్ కొడుకులైన వీరందరూ వంశాల నాయకులు. వీరి సంతతివారిలో యుద్ధసన్నద్ధులైన పరాక్రమశాలురు పదిహేడు వేల రెండు వందల మంది.

[12] షుప్పీంవారూ హుప్పీంవారూ ఈరు సంతతివారు. హుషీంవారు అహేరు సంతతివారు.

[13] నఫ్తాలి కొడుకులు: బిల్‌హాకు జన్మించిన యుహసయేల్, గూనీ, యేసేరు, షిల్లేం.

[14] మనష్షే సంతతివారు: అతనికి సిరియా దేశస్ధురాలైన తన ఉంపుడుకత్తె అశ్రీయేల్‌ను కన్నది. ఆమె గిలాదుకు తండ్రి మాకీరును కూడా కన్నది.

[15] మాకీరు షుప్పీంవారి, హుప్పీంవారి మధ్యనుంచి ఒకామెను పెళ్ళి చేసుకొన్నాడు. అతని సోదరి పేరు మయకా. రెండో సంతతివాడి పేరు సెలోపెహాదు. అతనికి కూతుళ్ళు మాత్రమే జన్మించారు.

[16] మాకీరు భార్య అయిన మయకా కొడుకును కని అతడికి పెరెషు అనే పేరు పెట్టింది. అతడి తమ్ముడి పేరు షెరెషు. షెరెషు కొడుకులు ఊలాం, రాకెం.

[17] ఊలాం కొడుకు: బెదాను. వీరు మనష్షే మనుమడూ మాకీర్ కొడుకూ అయిన గిలాదు కొడుకులు.

[18] మాకీరు సోదరి హమ్మోలెకెతు. ఆమె ఇషోదును, అబీయెజెరును, మహలాను కన్నది.

[19] షెమీదా కొడుకులు: అహెయాను, షెకెం, లికీ, అనీయాం.

[20] ఎఫ్రాయిం సంతతివారు: అతని కొడుకు షూతలహు, షూతలహు కొడుకు బెరెదు, బెరెదు కొడుకు తాహతు, తాహతు కొడుకు ఎలాదా, ఎలాదా కొడుకు తాహతు,

[21] తాహతు కొడుకు జాబాదు, జాబాదు కొడుకు షూతలహు. ఏజెరు, ఎల్‌యాదు తమ దేశంలో పుట్టిన గాతువాళ్ళ పశువులను పట్టుకుపోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు గాతువాళ్ళు వారిని చంపారు.

[22] వారి తండ్రి ఎఫ్రాయిం చాలా రోజులు దుఃఖించాడు. అతని సోదరులు వచ్చి అతణ్ణి ఓదార్చారు.

[23] ఆ తరువాత అతడు తన భార్యతో మళ్ళీ శయనించాడు. ఆమె గర్భవతి అయి కొడుకును కన్నది. తన కుటుంబానికి విపత్తు కలిగినందుచేత ఎఫ్రాయిం అతనికి బెరీయా అని పేరు పెట్టాడు.

[24] అతని కూతురు షెయెరా. ఆమె మీదిబేత్‌హోరోను, క్రింది బేత్‌హోరోను, ఉజ్జెను షెయెరాలను ఆమె కట్టించింది.

[25] ఎఫ్రాయింకు రెపహు, రెషెపు కూడా జన్మించారు. రెషెపు కొడుకు తెలహు, తెలహు కొడుకు తహను.

[26] తహను కొడుకు లద్దాను. లద్దాను కొడుకు అమీహూదు. అమీహూదు కొడుకు ఎలీషామా.

[27] ఎలీషామా కొడుకు నూను. నూను కొడుకు యెహోషువ.

[28] వారి ఆస్తి, నివాస స్థలాలు: బేతేల్, దాని గ్రామాలు, తూర్పుగా ఉన్న నహరాను, పడమరగా ఉన్న గెజెరు, దాని గ్రామాలు, షెకెం, దాని గ్రామాలు. వారి ప్రాంతం గాజా, దాని గ్రామాలవరకు ఉంది.

[29] మనష్షే గోత్ర ప్రదేశం సరిహద్దు పొడుగున బేత్‌షెయాను, దాని గ్రామాలు, తానాకు, దాని గ్రామాలు, మెగిద్దో, దాని గ్రామాలు, దోరు, దాని గ్రామాలు ఉన్నాయి. ఈ స్థలాలలో ఇస్రాయేల్ కొడుకైన యోసేపు సంతతివారు కాపురమున్నారు.

[30] ఆషేరు కొడుకులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారికి శెరహు సోదరి.

[31] బెరీయా కొడుకులు: హెబెరు, మల్కీయేల్. మల్కీయేల్‌కు బిర్‌జాయీత్ జన్మించాడు.

[32] హెబెరుకు యపలేట్, షోమేరు, హోతాం, వారి సోదరి షూయా జన్మించారు.

[33] యపలేట్ కొడుకులు: పాసకు, బింహాల్, అష్వాతు. వీరు యపలేట్ కొడుకులు.

[34] షోమేరు కొడుకులు: అహీ, రోగా, యెహుబ్బా, అరాం.

[35] అతని సోదరుడైన హేలెం కొడుకులు: జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాల్.

[36] జోపహు కొడుకులు: సూయ, హర్‌నెపెరు, షూయాల్, బేరీ, ఇమ్రా,

[37] బేసెరు, హోదు, షమ్మా, షీల్షా, ఇత్రాను, బేర.

[38] ఎతెరు కొడుకులు: యెఫున్నె, పిస్పా, అరా.

[39] ఉల్లా కొడుకులు: ఆరహు, హన్నియేల్, రిజెయా.

[40] వీరందరూ ఆషేరు సంతతివారు. వారు వంశాల నాయకులు, ప్రఖ్యాతి చెందిన పరాక్రమశాలురు, ప్రముఖ నాయకులు. వారి వంశవృక్షంలో నమోదైన యుద్ధ సన్నద్ధులు ఇరవై ఆరు వేల మంది.

1 దినవృత్తాంతాలు — Chapters