[1] లేవీ కొడుకులు: గెర్షోను, కహాతు, మెరారి.
[2] కహాతు కొడుకులు: అమ్రాం, ఇసహారు, హెబ్రోను, ఉజ్జీయేల్.
[3] అమ్రాం సంతానం: అహరోను, మోషే, మిర్యాం. అహరోను కొడుకులుకు: నాదాబ్, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
[4] ఎలియాజరుకు ఫీనెహాసు జన్మించాడు. ఫీనెహాసుకు అబీషూవ జన్మించాడు.
[5] అబీషూవకు బుక్కీ జన్మించాడు. బుక్కీకి ఉజ్జీ జన్మించాడు.
[6] ఉజ్జీకి జెరహయా జన్మించాడు. జెరహయాకు మెరాయోతు జన్మించాడు.
[7] మెరాయోతుకు అమరయా జన్మించాడు. అమరయాకు అహీటూబ్ జన్మించాడు.
[8] అహీటూబ్‌కు సాదోకు జన్మించాడు. సాదోకుకు అహిమయసు జన్మించాడు.
[9] అహిమయసుకు అజరయా జన్మించాడు. అజరయాకు యోహానాను జన్మించాడు.
[10] యోహానానుకు అజరయా జన్మించాడు (సొలొమోను జెరుసలంలో కట్టించిన దేవాలయంలో ఈ అజరయా యాజిగా సేవ చేశాడు).
[11] అజరయాకు అమరయా జన్మించాడు. అమరయాకు అహీటూబ్ జన్మించాడు.
[12] అహీటూబ్‌కు సాదోకు జన్మించాడు. సాదోకుకు షల్లూం జన్మించాడు.
[13] షల్లూంకు హిల్కీయా జన్మించాడు. హిల్కీయాకు అజరయా జన్మించాడు.
[14] అజరయాకు శెరాయా జన్మించాడు. శెరాయాకు యెహోజాదాకు జన్మించాడు.
[15] యెహోవా నెబుకద్‌నెజరుచేత యూదావారినీ, జెరుసలం నగరవాసులనూ బందీలుగా దేశాంతరం పంపించినప్పుడు ఈ యెహోజాదాకు వారితో కూడా బందీగా వెళ్ళాడు.
[16] లేవీ కొడుకులు: గెర్షోను, కహాతు, మెరారి.
[17] గెర్షోను కొడుకుల పేర్లు ఇవి: లిబ్నీ, షిమి.
[18] కహాతు కొడుకులు: అమ్రాం, ఇసహారు, హెబ్రోను, ఉజ్జీయేల్.
[19] మెరారి కొడుకులు: మహలి, మూషి. వారి పూర్వీకుల వంశావళిప్రకారం లేవీగోత్రికుల కుటుంబాలు ఇవి:
[20] గెర్షోను కొడుకు లిబ్నీ. లిబ్నీ కొడుకు యహతు. యహతు కొడుకు జిమ్మా.
[21] జిమ్మా కొడుకు యోవాహు. యోవాహు కొడుకు ఇద్దో. ఇద్దో కొడుకు జెరహు. జెరహు కొడుకు యెయతిరయి.
[22] కహాతు కొడుకు అమ్మీనాదాబ్. అమ్మీనాదాబ్ కొడుకు కోరహు. కోరహు కొడుకు అస్సీరు.
[23] అస్సీరు కొడుకు ఎల్కానా. ఎల్కానా కొడుకు అబియాసాపు. అబియాసాపు కొడుకు అస్సీరు.
[24] అస్సీరు కొడుకు తాహతు. తాహతు కొడుకు ఉరియేల్. ఉరియేల్ కొడుకు ఉజ్జియా. ఉజ్జియా కొడుకు షావూల్.
[25] ఎల్కానా సంతతివారు: అమాశై, అహీమోతు.
[26] అహీమోతు కొడుకు ఎల్కానా. ఎల్కానా కొడుకు జోపై. జోపై కొడుకు నహతు.
[27] నహతు కొడుకు ఏలీయాబ్. ఏలీయాబ్ కొడుకు యెరోహాం. యెరోహాం కొడుకు ఎల్కానా, ఎల్కానా కొడుకు సమూయేల్.
[28] సమూయేల్ కొడుకులు: మొదట పుట్టినవాడు వష్నీ, రెండోవాడు అబీయా.
[29] మెరారి సంతతివారు: అతని కొడుకు మహలి, మహలి కొడుకు లిబ్నీ, లిబ్నీ కొడుకు షిమీ, షిమీ కొడుకు ఉజ్జా,
[30] ఉజ్జా కొడుకు షిమయా, షిమయా కొడుకు హగ్గీయా, హగ్గీయా కొడుకు అశాయా.
[31] ఒడంబడిక పెట్టెను యెహోవా ఆలయంలో ఉంచడం జరిగిన తరువాత ఆలయంలో సంగీత సేవకు దావీదు నియమించిన వారు వీరే.
[32] సొలొమోను జెరుసలంలో యెహోవా ఆలయాన్ని కట్టించేవరకు వీరు సన్నిధిగుడారం ఆవరణంలో సంగీత సేవ చేశారు. వారికి నియమించిన చట్టాలప్రకారం తమ పని చూచుకొన్నారు.
[33] ఇలాగు తమ కొడుకులతో కలిసి సేవ చేసినవారెవరంటే, కహాతు సంతతివారిలో హేమాను గాయకుడు. అతడు యోవేల్ కొడుకు. యోవేల్ సమూయేలు కొడుకు.
[34] సమూయేలు ఎల్కానా కొడుకు. ఎల్కానా యెరోహాం కొడుకు. యెరోహాం ఎలీయేల్ కొడుకు. ఎలీయేల్ తోయహు కొడుకు.
[35] తోయహు సూపు కొడుకు. సూపు ఎల్కానా కొడుకు. ఎల్కానా మహతు కొడుకు. మహతు అమాశయి కొడుకు.
[36] అమాశయి ఎల్కానా కొడుకు. ఎల్కానా యోవేల్ కొడుకు. యోవేల్ అజరయా కొడుకు. అజరయా జెఫనయా కొడుకు.
[37] జెఫనయా తాహతు కొడుకు. తాహతు అస్సీరు కొడుకు. అస్సీరు ఎబియాసాపు కొడుకు. ఎబియాసాపు కోరహు కొడుకు.
[38] కోరహు ఇసహారు కొడుకు. ఇసహారు కహాతు కొడుకు. కహాతు లేవీ కొడుకు. లేవీ ఇస్రాయేల్ కొడుకు.
[39] హేమాను సాటి సేవకుడు ఆసాపు. అతడు హేమాను కుడిప్రక్కన సేవ చేసేవాడు. ఆసాపు బరెకయా కొడుకు. బరెకయా షిమయా కొడుకు.
[40] షిమయా మికాయేల్ కొడుకు. మికాయేల్ బయశేయా కొడుకు. బయశేయా మల్కీయా కొడుకు.
[41] మల్కీయా యెత్నీ కొడుకు. యెత్నీ జెరహు కొడుకు. జెరహు అదాయా కొడుకు.
[42] అదాయా ఏతాను కొడుకు. ఏతాను జిమ్మా కొడుకు. జిమ్మా షిమీ కొడుకు.
[43] షిమీ యహతు కొడుకు. యహతు గెర్షోను కొడుకు. గెర్షోను లేవీ కొడుకు.
[44] హేమాను ఎడమ ప్రక్కన మెరారి వంశంలో ఒకడు సేవ చేసేవాడు. అతడు కీషీ కొడుకు ఏతాను. కీషీ అబ్దీ కొడుకు. అబ్దీ మల్లూకు కొడుకు.
[45] మల్లూకు హషబయా కొడుకు. హషబయా అమజ్యా కొడుకు. అమజ్యా హిల్కీయా కొడుకు.
[46] హిల్కీయా అమ్జీ కొడుకు. అమ్జీ బానీ కొడుకు. బానీ షెమెరు కొడుకు.
[47] షెమెరు మహలి కొడుకు. మహలి మూషి కొడుకు మూషి మెరారి కొడుకు. మెరారి లేవీ కొడుకు.
[48] వీరి సాటి లేవీగోత్రికులు ఆరాధన గుడారం అనే దైవ నివాసంలో జరగవలసిన పనులన్నిటికీ నియమించబడ్డారు.
[49] అయితే అహరోను, అతని సంతతివారు మాత్రమే దేవుని సేవకుడైన మోషే ఆదేశించిన అంతటిప్రకారమూ ఇస్రాయేల్ ప్రజల ప్రాయశ్చిత్తం కోసం అతి పవిత్ర స్థలంలో జరగవలసిన వాటన్నిటినీ చేయడానికీ, బలిపీఠం మీద హోమాలను అర్పించడానికీ, ధూపవేదిక మీద ధూపం వేయడానికీ నియమించబడ్డారు.
[50] అహరోను సంతతివారు: అతని కొడుకు ఎలియాజరు, ఎలియాజరు కొడుకు ఫీనెహాసు, ఫీనెహాసు కొడుకు అబీషూవ,
[51] అబీషూవ కొడుకు బుక్కీ, బుక్కీ కొడుకు ఉజ్జీ, ఉజ్జీ కొడుకు జెరహయా,
[52] జెరహయా కొడుకు మెరాయోతు, మెరాయోతు కొడుకు అమరయా, అమరయా కొడుకు అహీటూబ్,
[53] అహీటూబ్ కొడుకు సాదోకు, సాదోకు కొడుకు అహిమయసు.
[54] అహరోను సంతతివారిలో కహాతు వంశంవారిమీద మొదటి చీటి పడింది. ఇవి వారి నివాసస్థలాలు, వారి సరిహద్దులలోని వారి ఆస్తి:
[55] యూదాలో ఉన్న హెబ్రోను, దాని చుట్టు ఉన్న పచ్చిక మైదానాలు వారికి ఇవ్వబడ్డాయి.
[56] అయితే పట్టణం చుట్టు ఉన్న పొలాలు, దాని గ్రామాలు యెఫున్నె కొడుకు కాలేబుకు చేకూరాయి.
[57] హెబ్రోను శరణు పట్టణంగా ఉంది. అహరోను సంతతివారికి ఈ పట్టణాలు ఇవ్వబడ్డాయి: హెబ్రోను, లిబ్నా, దాని పచ్చిక మైదానాలు, యత్తీరు, ఎష్‌టెమోయ, దాని పచ్చిక మైదానాలు,
[58] హీలేను, దాని పచ్చిక మైదానాలు, దెబీరు, దాని పచ్చిక మైదానాలు, యత్తీరు, ఎష్‌టెమోయ,
[59] ఆషాను, దాని పచ్చిక మైదానాలు, బేత్‌షెమెషు, దాని పచ్చిక మైదానాలు.
[60] బెన్యామీను గోత్ర ప్రదేశంలో గెబ, దాని పచ్చిక మైదానాలు, అల్లెమెతు, దాని పచ్చిక మైదానాలు, అనాతోతు, దాని పచ్చిక మైదానాలు ఇయ్యబడ్డాయి. కహాతు వంశంవారికి కలిగిన పట్టణాలన్నీ పదమూడు.
[61] కహాతు వంశీయులలో మిగతావారికి మనష్షే అర్ధగోత్ర కుటుంబాల ప్రాంతంలో నుంచి చీటివల్ల పది పట్టణాలు ఇయ్యబడ్డాయి.
[62] గెర్షోను సంతతివారికి వారి వంశాల ప్రకారం చీట్లు వేయడం వల్ల పదమూడు పట్టణాలు వచ్చాయి. అవి ఇశ్శాకారు, ఆషేరు, నఫ్తాలి గోత్రాల ప్రదేశాలలో, బాషానులో ఉన్న మనష్షే గోత్రంవారి మధ్య ఉన్నాయి.
[63] మెరారి సంతతివారికి వారి వంశాల ప్రకారం చీట్లు వేయడం వల్ల పన్నెండు పట్టణాలు వచ్చాయి. అవి రూబేను, గాదు, జెబూలూను గోత్రాల ప్రదేశాలలో ఉండేవి.
[64] ఈ విధంగా ఇస్రాయేల్ ప్రజలు లేవీ గోత్రికులకు ఈ పట్టణాలను, వాటి పచ్చిక మైదానాల్ని ఇచ్చారు.
[65] యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల ప్రదేశాలలో పై చెప్పిన పట్టణాలు కూడా చీట్లు వేయడం వల్ల వారికి ఇచ్చారు.
[66] కహాతువారి కుటుంబాలకు కొన్నిటికి ఆస్తిగా ఎఫ్రాయిం గోత్ర ప్రదేశంలో కొన్ని పట్టణాలు వచ్చాయి.
[67] ఎఫ్రాయిం కొండసీమలో శరణు పట్టణంగా ఉన్న షెకెం, దాని పచ్చిక మైదానాలు, గెజెరు,
[68] యొక్‌మెయాం, బేత్ హోరోను,
[69] అయ్యాలోను, గత్‌రిమ్మోను, ఈ పట్టణాల పచ్చిక మైదానాలు వారికి వచ్చాయి.
[70] కహాతువారి మిగతా కుటుంబాలకు మనష్షే అర్ధ గోత్ర ప్రదేశంలోనుంచి ఆనేరు, బిలియాం, వాటి పచ్చిక మైదానాలతోపాటు ఇస్రాయేల్ ప్రజలు ఇచ్చారు.
[71] గెర్షోనువారికి ఈ పట్టణాలు వాటి పచ్చిక మైదానాలతో పాటు వచ్చాయి: మనష్షే అర్ధ గోత్ర ప్రదేశంలో నుంచి బాషానులో ఉన్న గోలాను, అష్‌తారోతు;
[72] ఇశ్శాకారు గోత్ర ప్రదేశంలో నుంచి కెదెషు, దాబరెతు,
[73] రామోతు, ఆనెం;
[74] ఆషేరు గోత్ర ప్రదేశంలోనుంచి మాషాల్, అబ్‌దోను,
[75] హూక్కోకు, రెహోబ్;
[76] నఫ్తాలి గోత్ర ప్రదేశంలో నుంచి గలలీలో ఉన్న కెదెషు, హమ్మోన్, కిర్యతాయిం.
[77] మిగిలిన లేవీ గోత్రికులైన మెరారివారికి ఈ పట్టణాలు, వాటి పచ్చిక మైదానాలతో పాటు వచ్చాయి: జెబూలూను గోత్ర ప్రదేశంలోనుంచి రిమ్మోన్, తాబోరు;
[78] యెరికోకు తూర్పుగా యొర్దాను అవతల ఉన్న రూబేను గోత్ర ప్రదేశంలో నుంచి ఎడారిలో ఉన్న బేసెరు, యహజా,
[79] కెదేమోతు, మేఫాతు;
[80] గాదు గోత్ర ప్రదేశంలోనుంచి గిలాదులో ఉన్న రామోతు, మహనయీం,
[81] హెష్బోను, యాజెరు.