Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:03

[1] నోవహు కొడుకులు షేము, హాము, యాపెతుల వంశావళి ఇది. జలప్రళయం తరువాత వాళ్లకు కొడుకులు పుట్టారు.

[2] యాపెతు సంతానం గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.

[3] గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా.

[4] యావాను సంతానం ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.

[5] వీళ్ళనుంచి సముద్రం వెంబడి మనుషులు వేరుపడి తమ ప్రాంతాలకు వెళ్ళారు. తమ తమ జాతుల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ వంశాల ప్రకారం, ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు వేరైపోయారు.

[6] హాము సంతానం కూషు, మిస్రాయిము, పూతు, కనాను.

[7] కూషు కొడుకులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. రాయమా కొడుకులు షేబ, దదాను.

[8] కూషుకు నిమ్రోదు పుట్టాడు. అతడు భూమి మీద పరాక్రమం కలిగిన శూరుల్లో మొదటివాడు.

[9] అతడు యెహోవా దృష్టిలో పరాక్రమం గల వేటగాడు. కాబట్టి “యెహోవా దృష్టిలో పరాక్రమం కలిగిన వేటగాడైన నిమ్రోదు వలే” అనే నానుడి ఉంది.

[10] షీనారు ప్రాంతంలో ఉన్న బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యంలో ముఖ్య పట్టాణాలు.

[11] ఆ ప్రాంతంలో నుంచి అతడు అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవె, రహోబోతీరు, కాలహు పట్టణాలను,

[12] నీనెవె కాలహుల మధ్య రెసెను అనే ఒక పెద్ద పట్టాణాన్నీ కట్టించాడు.

[13] మిస్రాయిముకు లూదీ, అనామీ, లెహాబీ, నప్తుహీ,

[14] పత్రుసీ, కస్లూహీ, కఫ్తోరీలు పుట్టారు. ఫిలిష్తీయులు కస్లూహీయుల సంతతి.

[15] కనాను మొదటి కొడుకు సీదోనుకు హేతు, యెబూసీ, అమోరీయ, గిర్గాషీ,

[16] హివ్వీ, అర్కీయు, సినీయ,

[17] అర్వాదీయ, సెమారీయ, హమాతీలు పుట్టారు.

[18] ఆ తరువాత కనానీయుల వంశాలు వ్యాప్తి చెందాయి.

[19] కనానీయుల సరిహద్దు సీదోను నుంచి గెరారుకు వెళ్ళే దారిలో గాజా వరకూ, సొదొమ గొమొర్రా, అద్మా సెబోయిములకు వెళ్ళే దారిలో లాషా వరకూ ఉంది.

[20] వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ జాతులను బట్టి హాము సంతానం.

[21] యాపెతు అన్న షేముకు కూడా సంతానం కలిగింది. ఏబెరు వంశానికి మూలపురుషుడు షేము.

[22] షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.

[23] అరాము కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాష.

[24] అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.

[25] ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళల్లో ఒకడు పెలెగు. ఎందుకంటే అతని రోజుల్లో భూమి విభజన జరిగింది. రెండవవాడు యొక్తాను.

[26] యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,

[27] హదోరము, ఊజాలు, దిక్లా,

[28] ఓబాలు, అబీమాయెలు, షేబ,

[29] ఓఫీరు, హవీలా, యోబాబులు పుట్టారు.

[30] వాళ్ళు నివాసం ఉండే స్థలాలు మేషా నుంచి సపారాకు వెళ్ళే దారిలో తూర్పు కొండలు.

[31] వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ ప్రాంతాలను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కొడుకులు.

[32] తమ తమ జనాల్లో తమ తమ సంతానాల ప్రకారం నోవహు కొడుకుల వంశాలు ఇవే. జలప్రళయం జరిగిన తరువాత వీళ్ళల్లోనుంచి జనాలు భూమి మీద వ్యాప్తి చెందారు.

ఆదికాండం — Chapters