Skip to content
Opens in a new window

[1] ఇతరులు అంటే గిట్టనివాడు తాను చేసే వాటిలో స్వార్థపరుడుగా ఉంటాడు. ప్రజలు మంచి సలహాను ఇచ్చినప్పుడు అతడు కోపగించు కుంటాడు

[2] బుద్ధిహీనుడు గ్రహించటానికి ఇష్టపడడు. ఆ వ్యక్తి ఎంతసేపూ తన స్వంత ఆలోచనలే చెప్పాలనుకొంటాడు.

[3] ఎక్కడ పాపం ఉంటుందో, అక్కడ అవమానం ఉంటుంది. ఎక్కడ అవమానం, ఉంటుందో అక్కడ ఘనత ఉండదు.

[4] ఒక వ్యక్తి చెప్పే విషయాలు జ్ఞానముగలవిగా ఉండవచ్చు. ఆ మాటలు లోతైన మహా సముద్రంలా లేక ప్రవహిస్తున్న ఏరులా ఉండవచ్చును.

[5] ఒకడు నేరస్థుడైతే వానికి సహాయం చేయవద్దు.అతడు తప్పు ఏమీ చేయకపోతే అతని యెడల న్యాయంగా ఉండు.

[6] బుద్ధిహీనుడు తాను చేప్పే మాటలవల్ల తనకు తానే కష్టం కలిగించుకొంటాడు. అతని మాటల వలన వివాదం మొదలు కావచ్చును.

[7] బుద్ధిహీనుడు మాట్లాడినప్పుడు అతడు తనను తానే నాశనం చేసుకొంటాడు. అతని స్వంత మాటలే అతన్ని పట్టేస్తాయి.

[8] మనుష్యులకు ఎంతసేపూ ముచ్చట్లు వినటం ఇష్టం. ఆ ముచ్చట్లు పొట్టలోనికి పోతోన్న మంచి భోజనంలా ఉంటాయి.

[9] బద్దకస్థుడు నాశనం చేసే వాని అంతటి చెడ్డవాడు.

[10] యెహోవా పేరులో ఎంతో బలం ఉంది. అది బలమైన ఒక దుర్గంలాంటిది. మంచివాళ్లు ఆ దుర్గం దగ్గరకు పరుగెత్తి వెళ్లి, క్షేమంగా ఉంటారు.

[11] ధనికులు వారి ఐశ్వర్యం వారిని కాపాడుతుంది అనుకొంటారు. అది ఒక బలమైన కోటలా ఉంది అని వారు తలుస్తారు.

[12] ఒక దీనుడు గౌరవించబడతాడు. కానీ గర్విష్ఠుడు పతనం అవుతాడు.

[13] ఒకడు పూర్తిగా వినక ముందే జవాబిస్తే అతడు ఇబ్బంది పడిపోయి, తాను తెలివితక్కువ వాడిని అని చూపించుకొంటాడు.

[14] ఒక మనిషి వ్యాధితో ఉన్నప్పుడు అతని మనస్సు అతణ్ణి బ్రతికించి ఉంచగలదు. కానీ ఆ మనిషి అంతా పోయింది అనుకొంటే అప్పుడు ఆశ అంతా పదలు కొన్నట్టే!

[15] జ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అని అనుకుంటాడు. మరింత జ్ఞానము కోసం అతడు జాగ్రత్తగా వింటాడు.

[16] ఒక ప్రముఖ వ్యక్తిని నీవు కలుసుకోవాలి అని అంటే అతనికి ఒక కానుక ఇవ్వాలి. అప్పుడు నీవు అతనిని తేలికగా కలుసుకోగలవు.

[17] ఇంకో మనిషి వచ్చి ప్రశ్నించే అంత వరకు మొదలు మాట్లాడిన వానిది సరిగ్గా ఉన్నట్టే కనిపిస్తుంది.

[18] ఇద్దరు శక్తిగల మనుష్యులు వాదిస్తోంటే వారి వాదాన్ని తీర్మానించటానికి చీట్లు వేయటమే శ్రేష్ఠమైన పద్ధతి.

[19] నీ స్నేహితునికి నీవు సహాయం చేస్తే అతడు ఒక బలమైన పట్టణపు గోడలా నిన్ను కాపాడుతాడు. వివాదాలు కోట గుమ్మాల అడ్డగడియవలె ప్రజలను వేరుపరుస్తాయి.

[20] నీవు చెప్పే విషయాలు నీ జీవితం మీద ఏదో విధంగా పనిచేస్తాయి. తన నోటి ఫలముచేత ఒక మనిషి నింపబడుతాడు.

[21] జీవం, మరణం, తెచ్చే మాటలు నాలుక మాట్లాడ గలదు. ప్రజలు మాట్లాడటం ఇష్టపడేవారు. అది ఏమి తెచ్చునో దాన్ని తీసుకొనుటకు సిద్దముగా ఉండ వలయును.

[22] నీకు భార్య దొరికినట్లయితే నీవు మేలు పొంది నట్టే. నీ విషయమై యెహోవాకు సంతోషం.

[23] పేదవాడు సహాయము కొరకు అడుక్కుంటాడు. కాని ధనికుడు కఠినముగా సమాధానము చెప్పవచ్చు.

[24] ఒక మనిషికి స్నేహితులు చాలా మంది ఉంటే అది అతనిని పాడు చేయవచ్చును. కాని ఒక సోదరుని కంటే ఒక మంచి స్నేహితుడు మేలు.

సామెతలు — Chapters