Skip to content
Opens in a new window
Listen to this chapter • 8:25

[1] కైసరు తిబెరి రాజ్యపాలన చేస్తున్న పదు నైదవ సంవత్సరములో: యూదయ దేశాన్ని పొంతి పిలాతు పాలిస్తూ ఉన్నాడు. హేరోదు గలిలయ దేశానికి సామంతరాజుగా ఉన్నాడు. హేరోదు తమ్ముడు ఫిలిప్పు ఇతూరయ, త్రకోనీత ప్రాంతాలకు పాలకుడుగా ఉన్నాడు. లుసానియా అబిలేనే రాష్ట్రానికి సామంతరాజుగా ఉన్నాడు.

[2] ఇతని కాలంలోనే అన్న మరియు కయప ప్రధాన యాజకులుగా ఉన్నారు. వీళ్ళ కాలంలోనే జెకర్యా కుమారుడైన యోహాను అరణ్య ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నాడు. అక్కడ అతనికి దేవుని సందేశం లభించింది.

[3] ఆతర్వాత అతడు యొర్దాను నది చుట్టూ ఉన్న ప్రాంతాలన్ని తిరిగి, “పాప క్షమాపణ పొందాలంటే మారుమనస్సు కలిగి బాప్తిస్మము పొందాలి” అని బోధించాడు.

[4] దీన్ని గురించి యెషయా ప్రవక్త గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది: “‘ప్రభువు కోసం మార్గం వేయుమని ఆయన బాటలు చక్కగా చేయుమని ఎడారి ప్రాంతములో ఒక గొంతు ఎలుగెత్తి పలికింది.

[5] లోయలు పూడ్చివేయ బడుతాయి. కొండలు గుట్టలు నేలమట్టమౌతాయి. వంకర బాటలు చక్కగా ఔతాయి. కరుకు బాటలు నునుపుగా ఔతాయి.

[6] మానవులు దేవుడు ప్రసాదించే రక్షణను చూస్తారు!’”

[7] ప్రజలు బాప్తిస్మము పొందటానికి గుంపులు గుంపులుగా యోహాను దగ్గరకు వచ్చారు. యోహాను, “మీరు సర్పసంతానం. దేవునికి కోపం రానున్నది. ఆ కోపం నుండి పారిపోవాలనుకుంటున్నారు. అలా చేయుమని ఎవరు చెప్పారు?

[8] మారుమనస్సు పొందినట్లు ఋజువు చేసే పనులు చెయ్యండి. ‘అబ్రాహాము మా తండ్రి’ అని గొప్పలు చెప్పుకొన్నంత మాత్రాన లాభం లేదు. ఈ రాళ్ళనుండి దేవుడు అబ్రాహాము సంతానాన్ని సృష్టించగలడని నేను చెబుతున్నాను.

[9] చెట్లవేళ్ళమీద గొడ్డలి సిద్ధంగా ఉంది. మంచి ఫలమివ్వని చెట్టును కొట్టెసి ఆయన మంటల్లో పార వేస్తాడు” అని అన్నాడు.

[10] “మరి మేము ఏం చెయ్యాలి?” అని ప్రజలు అడిగారు.

[11] యోహాను, “రెండు చొక్కాలున్న వాడు ఒక చొక్కాకూడా లేని వానితో వాటిని పంచుకోవాలి. అలాగే మీ ఆహారం కూడా పంచుకోవాలి” అని అన్నాడు.

[12] పన్నులు సేకరించేవాళ్ళు కూడా బాప్తిస్మము పొందటానికి వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు.

[13] “సేకరించ వలసిన పన్నుల కన్నా ఎక్కువ పన్నులు సేకరించవద్దు” అని అతడు వాళ్ళతో అన్నాడు.

[14] కొందరు సైనికులు కూడా వచ్చి, “మేము ఏం చెయ్యాలి?” అని అతణ్ణి అడిగారు. అతడు సమాధానం చెబుతూ, “ప్రజల నుండి డబ్బుగుంజవద్దు! వాళ్ళపై తప్పుడు నిందలు మోపకండి. మీ జీతంతో తృప్తి చెందండి” అని అన్నాడు.

[15] ప్రజలు రానున్న వాని కోసం ఆశతో కాచుకొని ఉన్నరోజులవి. వాళ్ళు యోహానే క్రీస్తు అయి ఉండవచ్చనుకున్నారు.

[16] యోహాను వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను మీకు నీటిలో బాప్తిస్మము నిచ్చాను. కాని నాకన్నా శక్తిగలవాడు వస్తాడు. ఆయన కాలిచెప్పులు విప్పే అర్హతకూడా నాకు లేదు. ఆయన మీకు పవిత్రాత్మలో, అగ్నిలో బాప్తిస్మమునిస్తాడు.

[17] చేట ఆయన చేతిలో ఉంది. ఆయన ఆ చేటతో ధాన్యాన్ని శుభ్రపరచి తన ధాన్యాన్ని కొట్టులో దాచుకొని, పొట్టును ఆరని మంటల్లో కాల్చివేస్తాడు.”

[18] యోహాను వాళ్ళకు హెచ్చరిక కలిగేటట్లు యింకా ఎన్నో విషయాలు చెప్పాడు. సువార్త కూడా ప్రకటించాడు.

[19] రాజ్యాధికారి హేరోదుకు అతని సోదరుని భార్య అయిన హేరోదియతో సంబంధంవుంది. దీని కారణంగా, హేరోదు చేసిన యితర దుష్కార్యాల కారణంగా యోహాను అతణ్ణి తీవ్రంగా విమర్శించాడు.

[20] తద్వారా హేరోదు, యోహానును కారాగారంలో ఉంచాడు. ఇలా చేసి తాను చేసిన దుష్కార్యాలకు మరొక దుష్కార్యం చేర్చుకొన్నాడు.

[21] యోహాను ప్రజలకు బాప్తిస్మమునిస్తూ వుండినాడు. అప్పుడు వాళ్ళతో సహా యేసుకు కూడా బాప్తిస్మమునిచ్చాడు. యేసు ప్రార్థిస్తుండగా పరలోకం తెరువబడింది.

[22] పవిత్రాత్మ ఒక పావురం రూపంలో దిగివచ్చి ఆయనపై వ్రాలాడు. వెంటనే పరలోకం నుండి ఒక స్వరం, “నీవు నా ప్రియ కుమారుడివి, నిన్ను నేను ప్రేమించుచున్నాను. నీయందు ఎక్కువగా నేను ఆనందించుచున్నాను” అని వినబడింది.

[23] యేసు బోధించటం మొదలు పెట్టినప్పుడు ఆయనకు సుమారు ముప్పై సంవత్సరాలు. యేసు యోసేపు కుమారుడు అని ప్రజలు అనుకునేవాళ్ళు. యోసేపు హేలీ కుమారుడు,

[24] హేలీ మత్తతు కుమారుడు, మత్తతు లేవి కుమారుడు. లేవి మెల్కీ కుమారుడు. మెల్కీ యన్న కుమారుడు. యన్న యోసేపు కుమారుడు.

[25] యోసేపు మత్తతీయ కుమారుడు, మత్తతీయ ఆమోసు కుమారుడు. ఆమోసు నాహోము కుమారుడు, నాహోము ఎస్లి కుమారుడు. ఎస్లి నగ్గయి కుమారుడు.

[26] నగ్గయి మయతు కుమారుడు. మయతు మత్తతీయ కుమారుడు. మత్తతీయ సిమియ కుమారుడు. సిమియ యోశేఖు కుమారుడు. యోశేఖు యోదా కుమారుడు.

[27] యోదా యోహన్న కుమారుడు. యోహన్న రేసా కుమారుడు, రేసా జెరుబ్బాబేలు కుమారుడు. జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడు. షయల్తీయేలు నేరి కుమారుడు,

[28] నేరి మెల్కీ కుమారుడు, మెల్కీ అద్ది కుమారుడు. అద్ది కోసాము కుమారుడు, కోసాము ఎల్మదాము కుమారుడు, ఎల్మదాము ఏరు కుమారుడు,

[29] ఏరు యెహోషువ కుమారుడు. యెహోషువ ఎలీయెజెరు కుమారుడు. ఎలీయెజెరు యోరీము కుమారుడు. యోరీము మత్తతు కుమారుడు, మత్తతు లేవి కుమారుడు.

[30] లేవి షిమ్యోను కుమారుడు, షిమ్యోను యూదా కుమారుడు, యూదా యోసేపు కుమారుడు. యోసేపు యోనాము కుమారుడు. యోనాము ఎల్యాకీము కుమారుడు,

[31] ఎల్యాకీము మెలెయా కుమారుడు. మెలెయా మెన్నా కుమారుడు. మెన్నా మత్తతా కుమారుడు. మత్తతా నాతాను కుమారుడు. నాతాను దావీదు కుమారుడు,

[32] దావీదు యెష్షయి కుమారుడు, యెష్షయి ఓబేదు కుమారుడు, ఓబేదు బోయజు కుమారుడు, బోయజు శల్మాను కుమారుడు, శల్మాను నయస్సోను కుమారుడు,

[33] నయస్సోను అమ్మీనాదాబు కుమారుడు. అమ్మీనాదాబు అరాము కుమారుడు. అరాము ఎస్రోము కుమారుడు, ఎస్రోము పెరెసు కుమారుడు, పెరెసు యూదా కుమారుడు.

[34] యూదా యాకోబు కుమారుడు, యాకోబు ఇస్సాకు కుమారుడు, ఇస్సాకు అబ్రాహాము కుమారుడు, అబ్రాహాము తెరహు కుమారుడు, తెరహు నాహోరు కుమారుడు,

[35] నాహోరు సెరూగు కుమారుడు, సెరూగు రయూ కుమారుడు, రయూ పెలెగు కుమారుడు, పెలెగు హెబెరు కుమారుడు, హెబెరు షేలహు కుమారుడు,

[36] షేలహు కేయినాను కుమారుడు, కేయినాను అర్పక్షదు కుమారుడు, అర్పక్షదు షేము కుమారుడు, షేము నోవహు కుమారుడు, నోవహు లెమెకు కుమారుడు,

[37] లెమెకు మెతూషెల కుమారుడు, మెతూషెల హనోకు కుమారుడు, హనోకు యెరెదు కుమారుడు, యెరెదు మహలలేలు కుమారుడు, మహలలేలు కేయినాను కుమారుడు,

[38] కేయినాను ఎనోషు కుమారుడు, ఎనోషు షేతు కుమారుడు, షేతు ఆదాము కుమారుడు, ఆదాము దేవుని కుమారుడు.

లూకా సువార్త — Chapters