Skip to content
Opens in a new window

[1] ప్రజల నాయకులు జెరుసలంలో నివాసం చేశారు. మిగిలిన ప్రజలు పవిత్ర నగరమైన జెరుసలంలో ప్రతి పదిమందిలో ఒకడు నివాసం చేయాలని తక్కిన తొమ్మిదిమంది వేరు వేరు ఊళ్ళలో ఉండిపోవాలనీ చీట్లు వేశారు.

[2] జెరుసలంలో నివసించడానికి మనసారా అంగీకరించిన వారిని ప్రజలు దీవించారు.

[3] ఇస్రాయేల్ ప్రజలలో, యాజులలో, లేవీ గోత్రికులలో, దేవాలయ సేవకులలో, సొలొమోను సేవకుల సంతానంలో కొంతమంది యూదా ఊళ్ళలో ఎవరి వాటాలో వారు నివాసం చేశారు.

[4] యూదావారిలో, బెన్‌యామీనువారిలో మరికొందరు జెరుసలంలో నివాసం చేశారు. జెరుసలంలో కాపురం ఏర్పరచుకొన్న ప్రాంతీయ నాయకులు వీరు: యూదా వంశంలో జెకర్యా మనుమడూ ఉజ్జీయా కొడుకూ అయిన అతాయా (జెకర్యా తండ్రి అమరయా, అమరయా తండ్రి షెపటయా. షెపటయా తండ్రి మహలలేల్. మహలలేల్ పెరెసు సంతతివారిలో ఒకడు).

[5] కొల్‌హోజె మనుమడూ బారుకు కొడుకూ అయిన మయశేయా (కొల్‌హోజె తండ్రి హజాయా. హజాయా తండ్రి అదాయా. అదాయా తండ్రి యోయారీబ్. యోయారీబ్ తండ్రి జెకర్యా. జెకర్యా షెలా సంతతివారిలో ఒకడు.)

[6] జెరుసలంలో నివాసం చేసిన పెరెసు వంశం వారందరూ నాలుగు వందల అరవై ఎనిమిదిమంది. వారు పరాక్రమశాలురు.

[7] బెన్యామీను వంశంలో వీరు ఉన్నారు: యోవేదు మనుమడూ మెషుల్లాం కొడుకూ అయిన సల్లు (యోవేదు పెదాయూ కొడుకు, పెదాయా కోలాయా కొడుకు, కోలాయా మయశేయా కొడుకు, మయశేయా ఈతీయేల్ కొడుకు, ఈతీయేల్ యెషయా కొడుకు);

[8] అతని అనుచరులు గబ్బయి, సల్లయి, ఆ వంశం వారందరూ తొమ్మిదివందల ఇరవై ఎనిమిది మంది.

[9] జిక్రీ కొడుకు యోవేల్ వారికి అధికారిగా ఉన్నాడు. హాసెనూయా కొడుకు యూదా నగరం మీద రెండో అధికారిగా ఉన్నాడు.

[10] యాజులలో వీరు ఉన్నారు: యోయారీబ్ కొడుకు యెదాయా, యాకీను,

[11] దేవాలయానికి అధికారిగా ఉన్న శెరాయా. (శెరాయా మెషుల్లాం కొడుకు, మెషుల్లాం సాదోకు కొడుకు, సాదోకు మెరాయోతు కొడుకు, మెరాయోతు అహీటూబ్ కొడుకు.)

[12] వారి బంధువులు ఆలయం పనిచేసినవారు. వారు ఎనిమిది వందల ఇరవై ఇద్దరు; పెలలయా మనుమడూ యెరోహాం కొడుకూ అయిన అదాయా (పెలలయా అమ్జీ కొడుకు, అమ్జీ జెకర్యా కొడుకు, జెకర్యా పషూరు కొడుకు, పషూరు మల్కీయా కొడుకు);

[13] కుటుంబ నాయకులుగా ఉన్న అతని బంధువులు రెండు వందల నలభై ఇద్దరు; అహజయి మనుమడూ అజరేల్ కొడుకూ అయిన అమష్షయి (అహజయి మెషిల్లేమోతు కొడుకు, మెషిల్లేమోతు ఇమ్మేరు కొడుకు),

[14] అతని బంధువులు నూట ఇరవై ఎనిమిది మంది. వారు బలాఢ్యులైన పరాక్రమశాలురు. వారికి అధికారి హగదోలీం కొడుకు జబ్‌దీయేల్.

[15] లేవీగోత్రికులలో వీరు ఉన్నారు: అజ్రీకాం మనుమడూ హష్షూబ్ కొడుకూ అయిన షెమయా (అజ్రీకాం హషబయా కొడుకు, హషబయా బున్నీ కొడుకు);

[16] లేవీగోత్రికులలో ఇద్దరు నాయకులు షబ్బెతయి, యోజాబాదు (వారు దేవాలయం బయటి పనులను పై విచారణ చేసే అధికారులు);

[17] ఆసాపుకు పుట్టిన జబ్ది మనుమడూ, మీకా కొడుకూ అయిన మత్తనయా (ప్రార్థన, స్తుతి సభలలో నాయకుడుగా ఉండేవాడు); తన బంధువులలో రెండోవాడు బక్‌బుకయా; యెదూతూనుకు పుట్టిన గాలాల్ మనుమడూ షమ్మూయ కొడుకూ అయిన అబ్దా.

[18] పవిత్ర నగరంలో ఉన్న లేవీగోత్రికులందరూ రెండు వందల ఎనభై నలుగురు.

[19] వీరు ద్వారపాలకులు: అక్కూబ్, టల్‌మోను, వారి సాటివారు నూట డెబ్భయి ఇద్దరు. వారు ద్వారాల దగ్గర కాపలాదారులు.

[20] ఇస్రాయేల్ ప్రజలలో, యాజులలో లేవీగోత్రికులలో మిగతా వారు యూదా ఊళ్ళలో ఎవరి వాటాలో వారు నివాసం చేశారు.

[21] దేవాలయ సేవకులు ఓపెల్ కొండమీద నివసించారు. వారికి జీహా, గిష్పా నాయకులు.

[22] జెరుసలంలో ఉన్న లేవీగోత్రికులకు హషబ్యా మనుమడూ బానీ కొడుకూ అయిన ఉజ్జీ అధికారిగా ఉన్నాడు (హషబ్యా మత్తనయా కొడుకు, మత్తనయా మీకా కొడుకు). దేవుని ఆలయం సేవకోసం బాధ్యత వహించిన ఆసాపు సంతతివారిలో ఉజ్జీ ఒకడు. ఆసాపు సంతతి వారు గాయకులు.

[23] గాయకులు ప్రతిరోజూ వంతుల ప్రకారం స్థిరంగా కార్యక్రమం జరపాలని మునుపు రాజు ఆదేశించాడు.

[24] యూదా కొడుకు జెరహు వంశంవాడైన మెషెజబేల్ కొడుకైన పెతహాయా ప్రజలను గురించిన అన్ని విషయాలలో చక్రవర్తికి సలహాదారుడు.

[25] గ్రామాలు, వాటి పొలాల సంగతి చూస్తే, యూదా వారిలో కొంతమంది కిర్యత్ అర్బాలో దాని పల్లెటూళ్ళలో, దీబోనులో దాని పల్లెటూళ్ళలో, యెకబ్‌సేల్‌లో దాని పల్లెటూళ్ళలో,

[26] యేషూవలో, మొలాదాలో, బేత్ పెలెతులో,

[27] హజర్‌షవల్‌లో, బేర్‌షెబాలో దాని పల్లెటూళ్ళలో,

[28] సిక్లగులో, మెకోనా దాని పల్లెటూళ్ళలో,

[29] ఎన్‌రిమ్మోనులో, జొరయాలో, యర్మూతులో,

[30] జానోహాలో, అదుల్లాంలో, వాటి పల్లెటూళ్ళలో, లాకీషులో దాని మైదానాలలో, అజేర్‌షెబా నుంచి హిన్నోంలోయ వరకు ఉన్న ప్రాంతంలో నివసించారన్న మాట.

[31] గెబకు చెందిన బెన్‌యామీనువారి సంతతివారు మిక్‌మషులో, ఆయాలో, బేతేల్‌లో దాని పల్లెటూళ్ళలో,

[32] అనాతోతులో, నోబులో, అననయాలో,

[33] హాసోరులో, రమాలో, గిత్తైలో,

[34] హాదీదు, జెబోయింలో, నెబల్లాట్‌లో,

[35] లోదులో, ఓనోలో, ‘లోహకారుల’ లోయలో నివాసం చేశారు.

[36] లేవీగోత్రికులలో కొన్ని గుంపులు యూదా ప్రదేశానికి చెందిన బెన్‌యామీనులో కాపురం ఏర్పరచుకొన్నాయి.

నెహెమ్యా — Chapters