Skip to content
Opens in a new window

[1] రాకుమారీ, ఆ పాదరక్షల్లో నీ పాదాలెంతో అందంగా ఉన్నాయి నీ తొడల వంపులు శిల్పి మలిచిన ఆభరణాల్ల ఉన్నాయి.

[2] నీ నాభి గుండ్రటి కలశంలా ఉంది దానికెన్నడూ ద్రాక్షారసం కొరత లేకుండుగాక. నీ ఉదరం పద్మ వలయితమైన గోధుమ రాశిలా ఉంది.

[3] నీ స్తనాలు లేజవరాలైన జింక అప్పుడే కన్న కవల పిల్లల్లా ఉన్నాయి.

[4] నీ మెడ దంతపు గోపురంలా ఉంది నీ నేత్రాలు బాత్ రబ్బీన్ సరసన ఉన్న హెష్బోనులోని తటా కాల్లా ఉన్నాయి. నీ నాసిక దమస్కు దిక్కుకి చూచే లెబానోను శిఖరంలా ఉంది.

[5] నీ తల కర్మెలు పర్వతంలా, నీ తల నీలాలు పట్టుకుచ్చుల్లా వున్నాయి. నీ సుదీర్ఘ కేశాలు చూసిన రాజు కూడా నీ వశం అవుతాడు.

[6] నీవు అతిలోక సుందరివి! అత్యంత మనోహరివి! ప్రియదర్శినివి! అందమైన, ఆహ్లాదకరమైన యువతివి!

[7] నీవు తాళవృక్షంలా పొడుగరివి. నీ స్తనాలు తాటిపళ్ల గెలల్లా వున్నాయి.

[8] నాకు ఆ చెట్టుపైకి ఎక్కాలని, దాని మట్టలు పట్టాలని ఉంది. నీ స్తనాలు ద్రాక్షా గుత్తుల్లా నీ ఊపిరి ఆపిలు సువాసనలా ఉన్నాయి.

[9] నీ నోరు శ్రేష్టమైన ద్రాక్షారసంలా అది నీ నోట జాలువారి నిద్రాముద్రిత ప్రియుని అధరాలను స్పృజించే మధువులా ఉండాలి.

[10] నేను నా ప్రియునిదానను నన్నతను వాంఛిస్తాడు!

[11] ఓ నా ప్రియుడా రా, చేలల్లోకి పోదాము రా, పల్లెల్లో రేయి గడుపుదాము రా,

[12] పెందలకడ లేచి ద్రాక్షాతోటలకు పోదాము ద్రాక్షా తీగలు మొగ్గ తొడిగాయో లేదో ఆ మొగ్గలు విచ్చుకున్నాయో లేదో దానిమ్మ చెట్లు విరబూశాయో లేదో తనివితీరా చూద్దాము. రా. అక్కడ నేనిచ్చునా ప్రేమ అందుకొన రా.

[13] ప్రేమ వర్ధక మండ్రేక ఓషధుల్నీ మా గుమ్మాన వేలాడే పరిమళభరితమైన పువ్వుల్నీ చూడు! ఓ నా ప్రియుడా, నీకై దాచి ఉంచాను ఎన్నెన్నో పండువీ, దోరవీ పండ్లు తిని చూడు!

పరమ గీతము — Chapters