[1] నోవహు కుమారులు షేము, హాము, యాఫెతు. ప్రళయం తర్వాత ఈ ముగ్గురు మగవాళ్లు ఇంకా అనేకమంది కుమారులకు తండ్రులయ్యారు. షేము, హాము, యాఫెతు ద్వారా వచ్చిన కుమారుల జాబితా ఇది. యాఫెతు వంశస్థులు:
[2] యాఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
[3] గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా
[4] యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.
[5] మధ్యధరా సముద్రానికి చుట్టు ప్రక్కల దేశాల్లో నివశించు ప్రజలంతా ఈ యాఫెతు కుమారుల సంతానమే. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత దేశం ఉంది. కుటుంబాలన్ని పెరిగి వేరు వేరు జాతుల వారయ్యారు. ప్రతి జాతివారికి వారి స్వంత భాష ఉంది.
[6] హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను.
[7] కూషు కుమారులు సెబా, హవీలా, సబ్తా. రాయమా కుమారులు షేబ, దదాను.
[8] కూషుకు నిమ్రోదు అనే కుమారుడు కూడా ఉన్నాడు. భూమిమీద నిమ్రోదు చాలా శక్తిమంతుడయ్యాడు.
[9] నిమ్రోదు యెహోవా యెదుట గొప్ప వేటగాడు. అందుకే మనుష్యులు కొందరిని నిమ్రోదుతో పోల్చి, “ఆ మనిషి నిమ్రోదు వలె యెహోవా యెదుట గొప్ప వేటగాడు” అంటారు.
[10] షీనారు దేశంలో బాబెలు, ఎరెకు, అక్కదు అనే చోట్ల నిమ్రోదు రాజ్యం ఆరంభం అయింది.
[11] నిమ్రోదు అష్షూరు కూడా వెళ్లాడు. అక్కడే నీనెవె రహోబో, తీరు, కాలహు,
[12] రెసెను పట్టణాలను అతడు నిర్మించాడు. (నీనెవెకు, కాలహు మహా పట్టణానికి మధ్య రెసెను ఉంది.)
[13] లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, సఫ్తుహీయులు.
[14] సత్రుసీయులు, కఫ్తోరీయుల జనాంగములకు మిస్రాయము తండ్రి. (ఫిలిష్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చిన వారే.)
[15] సీదోను తండ్రి కనాను. కనాను జ్యేష్ఠ కుమారుడు సీదోను, హేతుకు కనాను తండ్రి.
[16] యెబూసీయులు, అమోరీయులు, గీర్గాషీయులు.
[17] హివ్వీయులు, అర్కీయులు, సినీయులు.
[18] అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అందరికి కనాను తండ్రి. కనాను వంశాలు ప్రపంచంలోని వేర్వేరు భాగాలకు వ్యాప్తి చెందాయి.
[19] ఉత్తరాన సీదోను నుండి దక్షీణాన గెరారు వరకు, పశ్చిమాన గాజా నుండి తూర్పున సొదొమ, గొమొర్రా, అద్మా. సెబోయిము నుండి లాషా వరకు కనాను ప్రజల భూభాగమే.
[20] ఆ ప్రజలంతా హాము సంతానం. ఆ ప్రజలందరికీ వారికి స్వంత భాషలు, స్వంత దేశాలు ఉన్నాయు. వారు వేరు వేరు జాతులయ్యారు.
[21] యాఫెతు అన్న షేము. షేము వంశస్థుల్లో ఒకడైన ఏబెరు హెబ్రీ ప్రజలందరికీ తండ్రి.
[22] షేము కుమారులు, ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
[23] అరాము కుమారులు ఊజు, హోలు, గెతెరుమాష.
[24] అర్పక్షదు షేలహుకు తండ్రి. షేలహు ఏబెరుకు తండ్రి.
[25] ఏబెరు ఇద్దరు కుమారులకు తండ్రి, ఒక కుమారునికి పెలెగు అని పేరు పెట్టబడింది. అతని జీవిత కాలములోనే భూమి విభజించబడింది. కనుక అతనికి ఈ పేరు పెట్టబడింది. మరో సోదరుడి పేరు యొక్తాను.
[26] యొక్తాను కుమారులు అల్మదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
[27] హదోరము, ఊజాలు, దిక్లాను
[28] ఓబాలు, అబీమాయెలు, షేబ,
[29] ఓఫీరు, హవీలా, యోబాబు. ఈ మనుష్యులంతా యొక్తాను కుమారులు.
[30] మేషాకు దేశానికి, తూర్పునున్న కొండ దేశానికి మధ్య ఆ ప్రజలు జీవించారు. సెపారా దేశపు దిశలో మేషా ఉంది.
[31] వాళ్లు షేము వంశంనుండి వచ్చిన ప్రజలు. వంశాలు, భాషలు, దేశాలు, జాతులను బట్టి వారి క్రమం ఏర్పాటు చేయబడింది.
[32] నోవహు కుమారుల వంశాల జాబితా అది. అవి వారి జాతుల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. జలప్రళయం తర్వాత భూమి అంతటా వ్యాపించిన ప్రజలందరూ ఆ వంశాల నుండి వచ్చిన వారే.