Skip to content
Opens in a new window

[1] వీళ్లు బబులోను రాజ్యంలో నిర్బంధం నుంచి తిరిగి వచ్చినవాళ్లు. గతంలో బబులోను రాజైన నెబుకద్నెజరు వీళ్లని బందీలుగా పట్టుకొని, బబులోనుకు తెచ్చాడు. ఇప్పుడు వాళ్లు యెరూషలేముకు, యూదాకు తిరిగివచ్చారు. వాళ్లు తమతమ సొంత పట్టణాలకి తిరిగి వెళ్లారు.

[2] జెరుబ్బాబెలుతో పాటు తిరిగివచ్చిన వాళ్లలో యేషూవా, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా అనే వాళ్లున్నారు. బబులోను నుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్ల జాబితా, వాళ్ల సంఖ్యల వివరం ఇది:

[3] పరోషు వంశస్థులు 2,172

[4] షెపట్యా వంశస్థులు 372

[5] అరహు వంశస్థులు 775

[6] యెషూవ, యోవాబు వంశాలకి చెందిన పహత్మోయాబు, మోయాబు వంశస్థులు 2,812

[7] ఏలాము వంశస్థులు 1,254

[8] జత్తూ వంశస్థులు 945

[9] జక్కయి వంశస్థులు 760

[10] బానీ వంశస్థులు 642

[11] బేబై వంశస్థులు 623

[12] అజ్గాదు వంశస్థులు 1,222

[13] అదొనీము వంశస్థలు 666

[14] బిగ్వయి వంశస్థులు 2,056

[15] అదీను వంశస్థులు 454

[16] అటేరు వంశస్థులు (హిజ్కియా కుటుంబం) 98

[17] బెజయి వంశస్థలు 323

[18] యోరా వంశస్థలు 112

[19] హాషుము వంశస్థులు 223

[20] గిబ్బారు వంశస్థులు 95

[21] బెత్లెహేము పట్నానికి చెందినవాళ్లు 123

[22] నెటోపా పట్టణం వాళ్లు 56

[23] అనాతోతు పట్టణంవాళ్లు 128

[24] అజ్మావెతు పట్టణంవాళ్లు 42

[25] కిర్యాతారీము, కెఫీరా, బెయేరోతు పట్టణాల వాళ్లు 743

[26] రమా, గెబా పట్టణాలవాళ్లు 621

[27] మిక్మషు పట్టణం వాళ్లు 123

[28] బేతేలు, హాయి పట్టణంవాళ్లు 222

[29] నెబో పట్టణంవాళ్లు 52

[30] మగ్బీషు పట్టణంవాళ్లు 156

[31] ఏలాము అనే మరో పట్టణంవాళ్లు 1,254

[32] హారీము పట్టణంవాళ్లు 320

[33] లోదు, హదీదు, ఓనో పట్టణాలవాళ్లు 725

[34] యెరికో పట్టణంవాళ్లు 345

[35] సెనాయా పట్టణంవాళ్లు 3,630

[36] యాజకులు: యెషూవ కుటుంబానికి చెందిన యెదాయ వంశస్థులు#973

[37] ఇమ్మేరు వంశస్థులు#1,052

[38] పషూరు వంశస్థులు#1,247

[39] హారీము వంశస్థులు#1,017

[40] ఇప్పుడిక లేవీయులలో హోదవ్యా కుటుంబానికి చెందిన యేషూవా, కద్మీయేలు వంశస్థులు#74

[41] గాయకుల జాబితా: అసాపు వంశస్థులు#128

[42] దేవాలయపు ద్వారపాలకుల వంశస్థులు షల్లూము, ఆటేరు, టల్నోను, అక్కూబు, హటీటా, షోబయి వంశస్థులు#139

[43] దేవాలయపు ప్రత్యేక సేవకుల వంశస్థులు జీహా, హశూపా, టబ్బాయోతు,

[44] కేరోసు, సీయహా, పాదోను,

[45] లెబానా, హగాబా, అక్కూబు,

[46] హాగాబు, షల్మయి, హానాను,

[47] గిద్దేలు, గహరు, రెవాయా,

[48] రెజీను, నెకోదా, గజ్జాము,

[49] ఉజ్జా, పాసెయ, బేసాయి,

[50] అస్నా, మెహూనీము, నెపూసీము,

[51] బక్బూకు, హకూపా, హర్హూరు

[52] బజ్లీతు, మెహీదా, హర్షా

[53] బర్కోసు, సీసెరా, తెమహు

[54] నెజీయాహు, హటీపా,

[55] సొలొమోను సేవకుల వంశస్థులు: సొటయి, సోపెరెతు, పెరూదా,

[56] యహలా, దర్కోను, గిద్దేలు,

[57] షెపట్య, హట్టీలు, పొకెరెతు, జెబాయీము మరియు అమి

[58] దేవాలయసేవకులూ, మరిము సొలొమోను సేవకుల వంశస్థులు కలిసి మొత్తుం#392

[59] తేల్మెలహు తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు పట్టణాలనుంచి యెరూషలేముకు కొందరు వచ్చారు. అయితే వీళ్లు తమ కుటుంబాల వాళ్లయిన ఇశ్రాయేలీయుల కుటుంబాలకు చెందినవాళ్లమని నిరూపించుకో లేకపోయారు. వాళ్లెవరంటే,

[60] దెలాయ్యా, టోబీయా, నెకోదా సంతతివారు మొత్తం 652

[61] యాజకుల కుటుంబాలకు చెందిన ఈ క్రింది వంశస్థులు వున్నారు: హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వంశస్థులు. (గిలాదుకు చెందిన ఒకడు బర్జిల్లయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతను బర్జిల్లయి సంతతివాడిగా పరిగణించబడ్డాడు.)

[62] వీళ్లు తమ వంశ చరిత్రకోసం గాలించారు. కానీ అది వాళ్లకి లభ్యం కాలేదు. వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో నమోదు కాలేదు. తమ పూర్వీకులు యాజకులని వాళ్లు నిరూపించ లేకపోయారు. దానితో, వాళ్లు యాజకులగా సేవ చేయలేకపోయారు.

[63] వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులను తినకూడదని రాజ్యాధిపతి ఆజ్ఞ జారి చేశాడు. ఒక యాజకుడు ఊరీము, తుమ్మీము ధరించి, ఏమి చేయాలని దేవుణ్ణి అడిగేంతవరకు వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులేమీ తినలేకపోయారు.

[64] మొత్తంమీద తిరిగివచ్చిన ఆ వంశంలో 42,360 మంది వున్నారు. వాళ్లలో 7,337 మంది స్త్రీ, పురుష సేవకులను పరిగణలోకి తీసుకోకపోతే తేలిన సంఖ్య ఇది. వాళ్లతో 200 మంది గాయనీ గాయకులు కూడా వున్నారు.

[66] వాళ్లకి 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు, 435 ఒంటెలు, 6,720 గాడిదలు ఉన్నాయి.

[68] ఆ వంశం యెరూషలేములోని దేవుని ఆలయానికి చేరుకుంది. తర్వాత కుటుంబ పెద్దలు దేవాలయ నిర్మాణం కోసం తమ కానుకలు సమర్పించారు. పాత దేవాలయం నేలమట్టము చేయబడిన చోటనే కొత్త దేవాలయ నిర్మాణానికి వాళ్లు సమకట్టారు.

[69] వాళ్లు దేవాలయ నిర్మాణానికి తమ శక్తి కొద్దీ కానుకలు ఇచ్చారు 1,100 పౌనుల బంగారం, 3 టన్నుల వెండి, యాజకులు ధరించే 100 దుస్తులు వాళ్లు ఇచ్చారు.

[70] ఈ విధంగా యాజకులు, లేవీ గొత్రీకులు, తదితరులు కొంతమంది యెరూషలేముకి, దాని చుట్టూవున్న ప్రాంతాలకీ చేరుకున్నారు. ఈ వంశంలో దేవాలయ గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు వున్నారు. తదితర ఇశ్రాయేలీయులు తమతమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు.

ఎజ్రా — Chapters