Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:13

[1] ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ తూర్పు మైదానమంతటిలో ఉన్న వారిని ఓడించి వారి దేశాలను ఆక్రమించుకొన్న రాజులు ఎవరంటే,

[2] అమోరీయుల రాజు సీహోను. అతడు హెష్బోనులో నివసిస్తూ అర్నోను నదీ తీరంలోని అరోయేరు నుండి, అంటే ఆ నదీ లోయ మధ్య నుండి గిలాదు అర్థభాగమూ అమ్మోనీయులకు సరిహద్దుగా ఉన్న యబ్బోకు నది లోయ వరకూ

[3] తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రం వరకూ తూర్పు దిక్కున బెత్యేషీమోతు మార్గంలో ఉప్పు సముద్రంగా నున్న అరాబా సముద్రం వరకూ దక్షిణం వైపున పిస్గాకొండ చరియల కింద ఉన్న మైదానం వరకూ పరిపాలించాడు.

[4] ఇశ్రాయేలీయులు బాషాను రాజైన ఓగును పట్టుకున్నారు. అతడు రెఫాయీయుల్లో మిగిలిన వారిలో ఒకడు. అతడు అష్తారోతులో ఎద్రెయిలో నివసించి గెషూరీయుల, మాయకాతీయుల సరిహద్దు వరకూ బాషాను అంతటా సల్కా,

[5] హెర్మోను, హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకూ గిలాదు అర్థభాగంలో పాలించినవాడు.

[6] యెహోవా సేవకుడు మోషే, ఇశ్రాయేలీయులూ వారిని ఓడించారు. యెహోవా సేవకుడు మోషే, ఆ భూమిని రూబేనీయులకూ గాదీయులకూ మనష్షే అర్థగోత్రపు వారికీ స్వాస్థ్యంగా ఇచ్చాడు.

[7] యొర్దానుకు అవతల, అంటే పడమరగా లెబానోను లోయలో ఉన్న బయల్గాదు నుండి శేయీరు వరకూ వ్యాపించిన హాలాకు కొండవరకూ ఉన్న దేశాల రాజులను యెహోషువ, ఇశ్రాయేలీయులు జయించారు. యెహోషువ దాన్ని ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం స్వాస్థ్యంగా ఇచ్చాడు.

[8] కొండ ప్రాంతాల్లో, లోయలో షెఫేలా ప్రదేశంలో చరియల ప్రదేశాల్లో అరణ్యంలో దక్షిణ దేశంలో ఉన్న హిత్తీయులూ అమోరీయులూ కనానీయులూ పెరిజ్జీయులూ హివ్వీయులూ యెబూసీయులూ అనేవారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకున్నారు.

[9] వారెవరంటే, యెరికో రాజు, బేతేలు పక్కన ఉన్న హాయి రాజు, యెరూషలేము రాజు,

[10] హెబ్రోను రాజు, యర్మూతు రాజు,

[11] లాకీషు రాజు, ఎగ్లోను రాజు,

[12] గెజెరు రాజు, దెబీరు రాజు,

[13] గెదెరు రాజు, హోర్మా రాజు,

[14] అరాదు రాజు, లిబ్నా రాజు,

[15] అదుల్లాము రాజు, మక్కేదా రాజు,

[16] బేతేలు రాజు, తప్పూయ రాజు,

[17] హెపెరు రాజు, ఆఫెకు రాజు,

[18] లష్షారోను రాజు, మాదోను రాజు,

[19] హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు,

[20] అక్షాపు రాజు, తానాకు రాజు,

[21] మెగిద్దో రాజు, కెదెషు రాజు.

[22] కర్మెలులో యొక్నెయాము రాజు, దోరు మెరక ప్రాంతాల్లో ఉన్న దోరు రాజు,

[23] గిల్గాలులో గోయీయుల రాజు, తిర్సా రాజు.

[24] వారంతా కలిసి ముప్ఫై ఒక్క మంది రాజులు.

యెహోషువ — Chapters