[1] నెబుకద్నెజరు రాజు బబులోనుకు బందీలుగా తీసుకు వెళ్ళిన వారికి ఆ దేశంలో పుట్టి చెర నుండి విడుదల పొంది యెరూషలేము, యూదా దేశాల్లో తమ తమ పట్టణాలకు వెళ్ళడానికి అనుమతి పొందినవారు.
[2] వారిలో జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా, అనేవాళ్ళు ఉన్నారు. బబులోను నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజల లెక్క ఇది.
[3] పరోషు వంశం వారు 2, 172 మంది.
[4] షెఫట్య వంశం వారు 372 మంది.
[5] ఆరహు వంశం వారు 775 మంది.
[6] పహత్మోయాబు వంశం వారు యేషూవ యోవాబు వంశం వారితో కలిపి 2, 812 మంది.
[7] ఏలాము వంశం వారు 1, 254 మంది.
[8] జత్తూ వంశం వారు 945 మంది.
[9] జక్కయి వంశం వారు 760 మంది.
[10] బానీ వంశం వారు 642 మంది.
[11] బేబై వంశం వారు 643 మంది.
[12] అజ్గాదు వంశం వారు 1, 222 మంది.
[13] అదొనీకాము వంశం వారు 666 మంది.
[14] బిగ్వయి వంశం వారు 2,056 మంది.
[15] ఆదీను వంశం వారు 454 మంది.
[16] అటేరు వంశం వారు హిజ్కియాతో కలిపి 98 మంది.
[17] బెజయి వంశం వారు 323 మంది.
[18] యోరా వంశం వారు 112 మంది.
[19] హాషుము వంశం వారు 223 మంది,
[20] గిబ్బారు వంశం వారు 95 మంది.
[21] బేత్లెహేము వంశం వారు 123 మంది.
[22] నెటోపా వంశం వారు 56 మంది.
[23] అనాతోతు వంశం వారు 128 మంది.
[24] అజ్మావెతు వంశం వారు 42 మంది,
[25] కిర్యాతారీము, కెఫీరా, బెయేరోతు వంశాల వారు 743 మంది.
[26] రమా గెబ వంశం వారు 621 మంది.
[27] మిక్మషు వంశం వారు 123 మంది.
[28] బేతేలు, హాయి గ్రామం వారు 222 మంది.
[29] నెబో వంశం వారు 52 మంది.
[30] మగ్బీషు వంశం వారు 156 మంది.
[31] వేరొక ఏలాము వంశం వారు 1, 254 మంది.
[32] హారీము వంశం వారు 320 మంది.
[33] లోదు, హదీదు, ఓనో గ్రామాల వారు 725 మంది.
[34] యెరికో వంశం వారు 345 మంది.
[35] సెనాయా వంశం వారు 3, 630 మంది.
[36] యాజకుల్లో యేషూవ సంతానమైన యెదాయా వంశం వారు 953 మంది.
[37] ఇమ్మేరు వంశం వారు 1,052 మంది.
[38] పషూరు వంశం వారు 1, 247 మంది.
[39] హారీము వంశం వారు 1,017 మంది.
[40] లేవీయ గోత్రానికి చెందిన యేషూవ, కద్మీయేలు, హోదవ్యా, అనేవారి వంశం వారు మొత్తం 74 మంది.
[41] గాయకులైన ఆసాపు వంశం వారు 128 మంది.
[42] ద్వారపాలకులైన షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వంశం వారు 139 మంది.
[43] నెతీనీయులకు చెందిన జీహా, హశూపా, టబ్బాయోతు వంశాల వారు.
[44] కేరోసు, సీయహా, పాదోను వంశాల వారు.
[45] లెబానా, హగాబా, అక్కూబు వంశాల వారు.
[46] హాగాబు, షల్మయి, హానాను వంశాల వారు.
[47] గిద్దేలు, గహరు, రెవాయా వంశాల వారు.
[48] రెజీను, నెకోదా, గజ్జాము వంశాల వారు.
[49] ఉజ్జా, పాసెయ, బేసాయి వంశాల వారు.
[50] అస్నా, మెహూనీము, నెపూసీము వంశాల వారు.
[51] బక్బూకు, హకూపా, హర్హూరు వంశం వారు.
[52] బజ్లీతు, మెహీదా, హర్షా వంశాల వారు.
[53] బర్కోసు, సీసెరా, తెమహు వంశాల వారు.
[54] నెజీయహు, హటీపా వంశాల వారు.
[55] సొలొమోను సేవకుల వారసులు, సొటయి, సోపెరెతు, పెరూదా వంశాల వారు.
[56] యహలా, దర్కోను, గిద్దేలు వంశాల వారు.
[57] షెఫట్య, హట్టీలు, జెబాయీముకు చెందిన పొకెరెతు, ఆమీ వంశాల వారు.
[58] నెతీనీయులు, సొలొమోను సేవకుల వారసులు మొత్తం 392 మంది,
[59] ఇంకా తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు, అనే ప్రాంతాల నుండి మరి కొందరు వచ్చారు. అయితే వీరు తమ తండ్రుల కుటుంబాల, వంశాల రుజువులు చూపలేక పోవడం వల్ల వీరు ఇశ్రాయేలీయులో కాదో తెలియలేదు.
[60] వీళ్ళు దెలాయ్యా, టోబీయా, నెకోదా వంశాలవారు. వీరు 652 మంది,
[61] ఇంకా యాజకుల వారసులైన హబాయ్యా, హాక్కోజు వంశాలవారు, గిలాదు వాడైన బర్జిల్లయి కుమార్తెల్లో ఒకామెను పెండ్లి చేసికొన్న వారి పేర్లను బట్టి బర్జిల్లయి అనే వ్యక్తి వంశం వారు.
[62] వీరు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెదికారు గానీ వారు తమ యాజక వృత్తిలో అపవిత్రులయ్యారు కాబట్టి వారి పేర్లు కనబడలేదు.
[63] ఊరీము, తుమ్మీము ధరించుకొనే ఒక యాజకుడు నియామకం అయ్యే వరకూ దేవునికి ప్రతిష్ఠితమైన పదార్థాలను తినకూడదని వారి గవర్నర్ వారికి ఆజ్ఞాపించాడు.
[64] సమకూడిన ప్రజలు మొత్తం 42, 360 మంది అయ్యారు.
[65] వీరు కాకుండా వీరి దాసులు, దాసీలు 7, 337 మంది, గాయకులు, గాయనిలు 200 మంది ఉన్నారు.
[66] వారి దగ్గర గుర్రాలు 736, కంచర గాడిదలు 245,
[67] ఒంటెలు 435, గాడిదలు 6, 720 ఉన్నాయి.
[68] గోత్రాల ప్రముఖులు కొందరు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి వచ్చి, దేవుని మందిరం కట్టడానికి స్వచ్చందంగా కానుకలు అర్పించారు.
[69] ఆలయ నిర్మాణ పని కోసం తమ శక్తి కొద్ది 500 కిలోల బంగారం, 2, 800 కిలోల వెండి, ఖజానాకు ఇచ్చారు. 100 యాజక వస్త్రాలు ఇచ్చారు.
[70] యాజకులు, లేవీయులు, ప్రజల్లో కొందరు, గాయకులు, ద్వారపాలకులు, నెతీనీయులు తమ తమ పట్టణాలకు వచ్చి నివాసమున్నారు. ఇశ్రాయేలీయులంతా తమ తమ పట్టణాల్లో నివసించారు.