SATURDAY
Swara Madhuri Telugu Radio (స్వర మాధురి )తాళ్ళపాక అన్నమాచార్యులు దక్షిణ భారతదేశానికి చెందిన మొట్టమొదటి ప్రముఖ సంగీతకారుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని కీర్తిస్తూ కొన్ని వేల సంకీర్తనలను రూపొందించాడు. వెంకటేశ్వరస్వామి వద్ద ఉండే నందకమనే కత్తి యొక్క అవతారమే అన్నమాచార్య అని భావిస్తారు. అన్నమయ్య వంశీకులు అన్నమాచార్యులు అపర హరి అవతారంగా కీర్తించారు. తన సుదీర్ఘ జీవిత కాలంలో 32వేల సంకీర్తనలకు సంగీతాన్ని సమకూర్చి పాడాడు. అన్నమాచార్యులు స్వర పరచి పాడిన సంకీర్తనలను రాగి రేకులపై రచించి వాటిని తిరుమల సంకీర్తనా భాండాగారంలో భద్రపరిచారు.